అమరావతి : సినీ నిర్మాత-దర్శకుడు గుత్తా బాపినీడు చౌదరి (విజయ బాపినీడు) మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. మంగళవారం సిఎం విలేకరులతో మాట్లాడుతూ.. బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ బాపినీడు అని పేర్కొన్నారు. ఉత్తమ అభిరుచితో కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన కొద్ది మంది నిర్మాతల్లో విజయ బాపినీడు ఒకరని అన్నారు. విజయ బాపినీడు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుభూతి ప్రకటించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి విజయబాపినీడు : సిఎం చంద్రబాబు
