కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో వారం రోజులుగా కనిపించకుండా పోయిన టిఎంసి నేత రితేష్ మృత దేహాన్ని హుగ్లీ జిల్లాలో గుర్తించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని మర్షిదా గ్రామానికి చెందిన రితేష్ రాయ్, కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఫిబ్రవరి 7 నుండి కనిపించడంలేదని అన్నారు. హుగ్లీకి రెండు కిలోమీటర్ల దూరంలోగల దాద్పూర్ గ్రామంలోని పొదలలో అతని మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. అతని గొంతు, కంటిపై గాయాలు ఉన్నాయని, పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో అతన్ని గొంతు నులిమి చంపినట్లు తేలిందని అధికారులు తెలిపారు. అతని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుగ్లీ ఎస్ఐ వెల్లడించారు.
కనిపించకుండా పోయిన టిఎంసి నేత మృతదేహం లభ్యం
