అమరావతి : కేంద్ర ఎన్నికల సంఘం ఎపిలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. లోక్ సభ, శాసన సభ ఎన్నికల సన్నద్ధతపై ఈసి సమీక్షలు నిర్వహించనుంది. రేపు (మంగళవారం) నోడల్ అధికారులు, పోలీస్, రవాణా శాఖ, ఆదాయ పన్ను, వాణిజ్య పన్ను, రైల్వే, ఎయిర్ పోర్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. రేపు ఉదయం 10.30 గంటల నుండి సిఇసి బఅందం రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. సాయంత్రం కలెక్టర్లు, ఐజి లు, ఎస్పి లు ఇతర అధికారులతో భేటీ కానుంది. సిఎస్, హోం శాఖ సెక్రటరీలతో భేటీ కానుంది. ఈ భేటీలో సిఇసి సునీల్ అరోరా, ఇతర అధికారులు పాల్గొననున్నారు.
ఎపిలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
