ఇండోర్ : దేశ అభివృద్ధిలో దావూది బొహ్రా తెగకు చెందిన ప్రజల సేవలు ఎనలేనివని ప్రధాని మోడి ప్రశంసించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని సైఫీ మసీదులో ప్రారంభమైన పదిరోజుల అషు ముబారక ఉత్సవంలో భాగంగా శుక్రవారం ఇస్లాంలో ఒక తెగగా ఉన్న దావూది బొహ్రా ప్రజలు ఏర్పాటు చేసిన మత సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశపు సహ జీవనంలోని గొప్ప తనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, మధ్యప్రదేశ్ గవర్నర్ అనందిబెన్పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దావూది బొహ్రా ఆధ్యాత్మిక గురువు సయ్యద్నా ముఫద్దాల్ సైఫుద్దీన్‌ను మోడి కలుసుకున్నారు. మోడి సైఫుద్దీన్‌ను కలుసుకోవడం ఇదే తొలిసారి.
దావూది బొహ్రా ప్రజల సేవలు ఎనలేనివి : ప్రధాని మోడి
