శ్రీకాకుళం : ఎసిబి డిఎస్పీ కె.రాజేంద్ర ఆధ్వర్యంలో కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఎసిబి దాడులు నిర్వహించింది. దాడుల్లో నాలుగు సెల్ ఫోన్లు సీజ్ చేసింది. డాక్యుమెంటు రైటర్లు, సబ్ రిజష్ట్రార్ కార్యాలయ సిబ్బంది నుంచి రూ.90,400ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురు డాక్యుమెంటు రైటర్లు, ఎనిమిది మంది సిబ్బంది, ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది పై కేసులు నమోదు చేశారు. పెండింగులో ఉన్న డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు పరిశీలిస్తున్నారు.
