శ్రీకాకుళం : వంశధార ఇంజినీర్లతో కలెక్టర్ ధనుంజయరెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంశధార జలాశయ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. నిధులు కేటాయించి జిల్లాలో జలాశయాలలో మూత్ర జలాశయానికి తొలి ప్రాధాన్యత చూపుతామన్నారు. శ్రీ ముఖ నగము నుంచి హిరమండలం వరకు ప్రత్యేక రహదార్లు కల్పించి పర్యాటకులకు కనువిందు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు ఎస్ఈ సురేందర్‌రెడ్డి ఉన్నారు.