కావల్సినవి : పండిన మామిడి ముక్కలు- 1 కప్పు , పాలు (ఫ్యాట్ తక్కువ)- అరకప్పు, ఐస్ - అరకప్పు, పెరుగు- పావుకప్పు, తేనె లేదా చక్కెర- 1 టేబుల్ స్పూన్
తయారీ : మామిడి ముక్కలు, పాలు, ఐస్, తేనె, పెరుగులను బ్లెండర్లో వేయాలి. మెత్తగా, నురుగు వచ్చేట్లు బాగా బ్లెండ్ చేసుకోవాలి. తాజాగా గ్లాసులో సర్వ్ చేసుకుని తాగితే ఆ మామిడి స్మూతీ మజానే వేరు.