కావలసిన పదార్థాలు: బూడిదగుమ్మడి ముక్కలు - 2 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నిమ్మరసం - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : ముక్కలు మునిగేదాక నీరుపోసి, యాలకుల పొడి కలిపి 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ముక్కల్ని (కొళాయికింద) నీటితో కడగాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి కరిగించి, నిమ్మరసం, ముక్కలు వేయాలి. సన్నని సెగమీద ముక్కలకు పాకం బాగా పట్టాక దించేసి విడివిడిగా ఆరబెట్టాలి.