కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి- కప్పు, నీళ్లు-రెండున్నర కప్పులు, పంచదార- కప్పు, కొబ్బరి తురుము- కప్పు, పాలు- కప్పు, సారపప్పు పొడి- అర కప్పు, యాలకుల పొడి-పావు టీస్పూన్.
తయారుచేసే విధానం : ఒక పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి కలపకుండానే మూత పెట్టేసి చిన్న మంటపై నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత స్టవ్ కట్టేసి, పిండిని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ప్లేటులో ఉంచుకోవాలి. మరో పాత్ర స్టవ్‌పై ఉంచి, అందులో కాసిని నీళ్లు పోసి, పంచదార కూడా వేసి మరిగించాలి. మంట తగ్గించి అందులో కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత బియ్యప్పిండి ఉండలను అందులో వేసి పాలు పోసి మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి. తరువాత సారపప్పు పొడి వేసి, బాగా కలపాలి. పాకం కాస్త చిక్కగా అయ్యేటప్పుడు పైన యాలకుల పొడి చల్లి, దించేయాలి.
పాల ఉండ్రాళ్లు
