కావాల్సిన పదార్థాలు:
థనియాలు- 1టీ స్పూన్
ఆవాలు - 1/2 టీ స్పూన్
కూర పొడి - 1/2 టీ స్పూన్
అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్
ఉల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు
క్యారెట్ తరుగు- 4 కప్పులు
నిమ్మకాయ పీల్ - చిన్న ముక్క
వేరుశనగ నూనె- 3 టేబుల్ స్పూన్లు
ఉడకబెట్టిన చికెన్ రసం - 5 కప్పులు
తాజా నిమ్మ రసం- 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
ముందుగా ధనియాలు, ఆవాలను పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి కాగనివ్వాలి. అందులో ఆవాల పొడి, ధనియాల పొడి, కూర పొడి వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. తర్వాత అల్లం కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లి తరుగు, క్యారెట్ తరుగు, నిమ్మకాయ పీల్, చికెన్ రసం వేసి ఉడకనివ్వాలి. చిన్న మంటపై కూర ముక్కలన్నీ ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారాక నీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఉడికించిన పదార్థాలన్నిటిని మెత్తగా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తిరిగి బౌల్లో ఉంచిన నీటిలో వేసి కలపాలి. తర్వాత ఉడికించిన చికెన్ రసం, నిమ్మరసం, ఉప్పు, కారం చల్లి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి సర్వింగ్ బౌల్స్‌లో పోసి అతిధులకందించండి.