‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ ఫస్ట్‌ లుక్‌

Jan 10,2024 08:29 #movie, #vennela kishore

వెన్నెల కిషోర్‌ హీరోగా ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హౌమ్స్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను తాజాగా 24 మంది టాలీవుడ్‌ డైరెక్టర్లు ఒకేసారి రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకి రైటర్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తున్నారు. షెర్‌ అంటే షర్మిలమ్మ, లోక్‌ అంటే లోక్‌నాథం, హౌమ్‌ అంటే ఓం ప్రకాష్‌. ఈ మూడు పాత్రల చుట్టే కథ సాగుతుందని డైరెక్టర్‌ తెలిపారు. ఈ చిత్రంలో కొత్త వైబ్‌ కనిపిస్తోందని, ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే మంచి వినోదం ఉంటుదనే నమ్మకం కలుగుతుందని ఈ సందర్భంగా దిల్‌ రాజు అన్నారు. ఈ సినిమాకి సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.

➡️