ప్రజాశక్తి- ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో, 24న టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో కెరీర్ ఎక్స్ పేరుతో మెగా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ ఎన్.గోవిందరావు శనివారం తెలిపారు. ఈ మేళా కార్యక్రమానికి సుమారుగా 15 నుంచి 20 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఆమదాలవలస మండలంలోని సాగర్ డిగ్రీ కళాశాలలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా శిక్షణ పొందిన అభ్యర్ధులతో పాటు పదో తరగతి నుంచి ఎంఎస్సి, ఎంబిఎ తదితదర కోర్సులు పూర్తి చేసిన వారంతా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జాబ్మేళా ఎట్ ఎచ్చెర్ల, టెక్కలి పేరుతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9182008170, 9493988466 నెంబర్లులో సంప్రదించాలని కోరారు.
23, 24న జాబ్ మేళా
