ప్రజాశక్తి -ఎచ్చెర్ల
ఐటిఐ కళాశాలలో కాంట్రాక్టు (ఐఎంసి) బోధకుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తానని రాష్ట్ర శిక్షణా, ఉపాధి, కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని ఐఎంసి కాంట్రాక్టు ఉద్యోగుల సమాఖ్య నాయకులు గురుగుబెల్లి ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఉదయం నిమ్మాడలోని మంత్రి స్వగృహం వద్ద కలిసి, వినతిపత్రం అందించారన్నారు. దీనికి ఆయనకు సానుకూలంగా స్పందించారని వివరించారు. రాష్ట్ర పరిపాలన యంత్రాంగమంతా విజయవాడ, గుంటూరుకు తరలేపనిలో ఉందని, అది పూర్తిగానే ఈ సమస్యపై దృష్టిపెడతానని హామీనిచ్చారని పేర్కొన్నారు.
ఐటిఐ కాంట్రాక్టు బోధకుల క్రమబద్ధీకరణకు కృషి
