* కృష్ణా యూనివర్శిటీ అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి - నూజివీడు (కృష్ణా)
విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో లక్ష్య సాధన వైపు ముందుకు సాగాలని కృష్ణా విశ్వ విద్యాలయం డాక్టర్ ఎంఆర్.పిజి సెంటర్ ఎస్ఒ ఎంవి.బసవేశ్వరరావు అన్నారు. సోమవారం కృష్ణాజిల్లా నూజివీడు పిజి సెంటర్లో కృష్ణా యూనివర్శిటీ అంతర్ కళాశాల పురుషుల కబడ్డీ పోటీలను ఎస్ఒ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో యూనివర్శిటీ పరిధిలోని 13 జట్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభ మ్యాచ్ కెవిఆర్ కళాశాల (నందిగామ) 35-9 పాయింట్ల తేడాతో సిద్దార్థ ఫార్మసీ (నూజివీడు)కళాశాలపై, హిందూ కళా శాల (మచిలీపట్నం) 49 -41తో వైవిఎన్ఆర్ కళాశాలపై, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (అవనిగడ్డ) 50-45తో నోబుల్ కళాశాల (మచిలీపట్నం) విజయం సాధించాయి. ఇతర పోటీల్లో వికాస్ కళాశాల, ఎఆర్ అండ్ ఎస్ఆర్ కాలేజ్ (ఉయ్యూరు), లయోలా కళాశాల (విజయవాడ), ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల(విజయవాడ), జాకీర్ హుస్సేన్ కళాశాల (ఇబ్రహీంపట్నం) జట్లు విజయాలను నమోదు చేసుకున్నాయి.
విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి
