ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్:
42వ ఫెడరేషన్ కప్ జాతీయ మహిళా పుట్‌బాల్ పోటీల ఫైనల్లోకి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ జట్లు ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్ పుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ ఆర్ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, బీహార్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ఒంగోలు టూటౌన్ సిఐ రాజేష్, ఎపి పుట్‌బాల్ అసోసియే షన్ ఛైర్పర్సన్ గంగాడ సుజాత క్రీడాకారి ణులను పరిచయం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు 2-0 తేడాతో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించి ఫైన ల్కు చేరుకుంది. రెండో సెమీ ఫైనల్లో పశ్చిమ బెంగాల్ జట్టు క్రీడాకారిణులు చెలరేగటంలో ఆ జట్టు 4-0 గోల్స్ తేడాతో బీహార్ జట్టుపై ఘన విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో జార్ఖండ్‌తో పశ్చిమ బెంగాల్ జట్టు తలపడనుంది.
ఫైనల్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్
