దోహా: ఆసియా చాంపియన్‌షిప్‌లో సౌరభ్ చౌదరి మరో పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ రజత పతకం గెల్చుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో మెరిసిన సౌరభ్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. బంగారు పతకాన్ని ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ గెలుచుకున్నాడు. ఫైనల్ పోరులో కిమ్ సాంగ్ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్ 221.8 పాయింట్లతో కాంస్య పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్‌తో పాటు అభిషేక్ వర్మ కూడా ఫైనల్‌కు అర్హత సాధించినా ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఎనిమిది మంది పాల్గొన ఫైనల్లో అభిషేక్ 181.5 పాయింట్లు నమోదు చేశాడు. కాగా, అభిషేక్ వర్మ, సౌరభ్ చౌదరిలో ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
సౌరభ్‌కు రజతం
