* సెమీస్‌లో బెంగళూరు, యు ముంబ
అహ్మదాబాద్: ఉత్కంఠభరితంగా జరిగిన ప్రొ కబడ్డీ పోటీల్లో బెంగళూరు బుల్స్, యు ముంబ జట్లు విజయాలను నమోదు చేసుకున్నాయి. బెంగళూరు రైటర్ పవన్‌కుమార్ షెరావత్(20) సూపర్ రైడ్లతో ఆకట్టుకొని గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఉత్కంఠపోరులో బెంగళూరు బుల్స్ 48-45 పాయింట్ల తేడాతో యుపి యోథాపై గెలిచింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 36-36 పాయింట్లతో సమంగా నిలిచాయి. అనంతరం 6 నిమిషాల అదనపు సమయంలో బెంగళూరు 12 పాయింట్లు సాధించగా... యుపి 9 పాయింట్లను మాత్రమే సాధించి పరాజయాన్ని చవిచూసింది. అదనపు సమయంలోనూ షెరావత్ మెరుపులు కొనసాగడం విశేషం. అంతకుముందు నిర్ణీత సమయం ముగియడానికి మూడు నిమిషాల ముందు వరకు యుపి జట్టు 31-25 పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత ఒత్తిడికిలోనై అనవసరంగా పాయింట్లను సమర్పించుకోవడంతోపాటు మ్యాచ్‌నూ చేజార్చుకోవడం విశేషం. యుపి యోథా జట్టులో రిషాంక్ దెవాడిగా(11), శ్రీకాంత్ జాధవ్(9) రైడ్లలో రాణించగా... నితేష్‌కుమార్, సుమిత్, సురేందర్ ఐదేసి ట్యాకిల్ పాయింట్లు సాధించారు. ట్యాకిల్స్‌లో యుపి(14), బెంగళూరు(9) పాయింట్లే సాధించినా... బెంగళూరు ఆరుసార్లు యుపిని ఆలౌట్ చేయడం ఆ జట్టుకు గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబ జట్టు 46-38 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్ను చిత్తుచేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్ళింది.
షెరావత్ మెరుపులు
