- కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్
ప్రజాశక్తి - బాపట్ల (గుంటూరు జిల్లా)
పేదరికాన్ని అధిగమించి వెయిల్లిఫ్టింగ్లో సత్తా చాటిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన రాగాల రాహుల్ సమోవ-2019 పోటీల్లో మరోసారి దేశానికి వెండి పతకం సాధించాడు. స్నాస్ విభాగంలో 145 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 185 కిలోలు, మొత్తంగా 330 కిలోలు బరువెత్తిన రాహుల్‌ను పతకం వరించింది. 2017 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం, 2018లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకంతోపాటు వరల్డ్ బెస్ట్ లిఫ్టర్‌గా రాహుల్ నిలిచాడు. ఈ సందర్భంగా స్టువర్టుపురంలో రాహుల్ తండ్రి మధు శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. రాహుల్ కుటుంబానికి బాపట్ల ప్రాంతంలో రెండెకరాల పొలం, గుంటూరులో 500 గజాలు ఇంటి స్థలం ఇస్తాయమని గత ప్రభుత్వం చెపిందని, అయితే వీటి కేటాయింపు కోసం అధికారుల వద్దకు తాము ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని రాహుల్ తండ్రి మధు వాపోయారు.
అజరుకు 'రికార్డు' స్వర్ణం
అపియా(సమోయ): శుక్రవారం జరిగిన పురుషుల 81 కిలోల విభాగంలో అజరుసింగ్ రికార్డు నెలకొల్పి స్వర్ణాన్ని గెల్చుకున్నాడు. 22 ఏళ్ల అజరు 81 కిలోల విభాగంలో జాతీయ రికార్డును తుడిచేసి క్లీన్ అండ్ జర్క్‌లో 190 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు అర్హత సాధించాడు. ఆసియా యూత్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం గెల్చిన అజరు స్నాచ్‌లో 148 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 190 కిలోలు మొత్తమ్మీద 338 కిలోల బరువును ఎత్తాడు. దీంతో వ్యక్తిగత బెస్ట్ 320కిలోలు (142+178) కంటే 18 కిలోలు అదనంగా బరువును ఎత్తాడు. ఇదే విభాగంలో పపుల్ ఛాంగ్మయి రజితం సాధించాడు. అలాగే 87 కిలోల విభాగంలో గుంటూరుజిల్లా స్టువర్ట్‌పురానికి చెందిన రాగాల రాహుల్ 325 కిలోల బరువును ఎత్తి రజిత పతకాన్ని గెల్చుకున్నాడు. స్నాచ్‌లో 145కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 180 కిలోల బరువు ఎత్తాడు.
రాహుల్‌కు రజితం
