కాబూల్ : స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అస్గర్ ఆఫ్గాన్ సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రపంచకప్ టోర్నీలో 9 మ్యాచుల్లోనూ పరాజయాలను చవిచూసి అట్టడుగు స్థానంలో నిలిచింది. కొన్ని మ్యాచుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసినా ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేకపోయింది. గతంలో ఆఫ్ఘన్ క్రికెట్జట్టు వన్డేలకు గులాబుద్దిన్, టీ20లకు రషీద్‌ఖాన్, టెస్టులకు రామత్ షా కెప్టెన్లుగా వ్యవహరించారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో అన్ని ఫార్మెట్లకు రషీద్‌ఖాన్‌కు జట్టు పగ్గాలు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆఫ్ఘన్ కెప్టెన్‌గా రషీద్
