- అర్ధ సెంచరీతో ఆదుకున్న విహారి
- భారత్ మొదటి ఇన్నింగ్స్ 292కు ఆలౌట్
టీమిండియా ఆదివారం అద్భుత ప్రదర్శన చేసింది. ఆంధ్రప్రదేశ్ కుర్రాడు విహారి(56), రవీంద్ర జడేజా అజేయంగా 86 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల గౌరవప్రద స్కోర్‌కు చేరగల్గింది. తెలుగుతేజం విహారి ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్ర టెస్ట్మ్యాచ్లోనే అర్ధసెంచరీతో రాణించడంతో ద్రవిడ్, గంగూలీ సరసన చేరాడు. అంతేగాక భారత్ తరఫున తొలి టెస్ట్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన 26వ భారతీయుడిగా గుర్తింపు పొందాడు.
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగు తున్న చివరి టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌ టైంది. ఆల్‌రౌండర్ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు కడపటి వార్తలందే సమయానికి 34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరు గులు చేసింది. దీంతో భారత్‌పై తొలి ఇన్నింగ్స్ 40 పరు గుల ఆధిక్యతతో కలిపి 124 పరుగులు చేసినట్లయ్యింది.
అంతకుముందు ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజాలు ఆదుకున్నారు. కష్ట సమయం లో ఆదుకున్న హనుమ విహారి(56) జట్టు స్కోర్ 237 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం జడేజా ఒంటరి పోరాటం చేస్తూ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ల సాయంతో భారత్‌ను 292 పరుగుల గౌరవప్రద స్కోర్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్సింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యత లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, కరన్, మొయిన్ అలి రెండేసి వికెట్లతో రాణించారు.
నిలిచిన జడ్డూ-విహారి
ఐదో టెస్టులో అరంగేట్రం చేసిన తెలుగు ఆటగాడు హనుమ విహారి-రవీంద్ర జడేజా జోడీ ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధ వం తంగా ఎదుర్కొన్నారు. అండర్సన్, బ్రాడ్ గతి తప్పని బంతులతో పెట్టిన పరీక్షలో నిలిచారు. భోజన విరామానికి ముందు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పా రు. అయితే అర్ధశతకం తర్వాత బాగా ఆడుతున్న విహారిని మొయిన్ అలీ పెవిలి యన్‌కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన షమి మరోసారి సహచరుడికి అండగా నిలవకుండా పేలవ షాట్‌కు నిష్క్రమించాడు. చివరకు ఇషాంత్ శర్మ(4), జస్ప్రీత్ బుమ్రా (0) సహాయంతో జడ్డూ విజృంభించాడు. నాలుగైదు ఓవర్లు చివరి బంతికి సింగిల్ తీసుకొని మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. అయితే 95వ ఓవర్ చివరి బంతికి జడేజా సాధ్యం కాని పరుగుకు ప్రయత్నించాడు. దీంతో బుమ్రా రనౌట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
గంగూలీ, ద్రావిడ్ తర్వాత మనోడే
అరంగేట్ర టెస్ట్మ్యాచ్లోనే ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ల బౌలింగ్‌ను సునాయాసంగా ఎదుర్కొంటూ 104 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. దీంతో తొలిమ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్‌గా విహారి గుర్తింపు పొందడమేగాకుండా ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్ర మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇంతకుముందు 1996లో లార్డ్స్ టెస్ట్‌లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు ఈ ఘనతను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన విహారి చివరకు జట్టుస్కోర్ 237 పరుగులవద్ద ఏడో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ మొత్తంమ్మీద 124 బంతులను ఎదుర్కొని 56 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్‌లో బెయిర్స్ట్రోకు క్యాచ్ ఇచ్చి పెవిలీయన్‌కు చేరాడు.
అండర్సన్ ఫీజులో కోత
విరాట్ కోహ్లితో చివరిటెస్ట్లో వాగ్వాదానికి దిగిన పేసర్ అండర్స్‌న్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఐసిసి క్రీడా నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో అతనికి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా వేశారు.
జడేజా జోరు
