లండన్ : భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త విజరు మాల్యా శుక్రవారం భారత్-ఇంగ్లండ్ టెస్టుకు హాజరయ్యారు. భారత్-ఇంగ్లండ్ మధ్య లండన్ వేదికగా చివరి టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు విజరు మాల్యా నేరుగా స్టేడియానికి వచ్చారు. మాల్యా మ్యాచ్ చూసి తిరిగి వెళ్తున్నప్పుడు విలేకరులు 'మీరు భారత్‌కు ఎప్పుడు వెళ్తారని ప్రశ్నించగా...' 'జడ్జి తుది తీర్పు తర్వాతే తాను భారత్‌కు తిరిగి వెళ్తానని' బదులిచ్చారు. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సమయంలోనూ భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌కు మాల్యా హాజరయ్యారు. ప్రస్తుతం కోహ్లి సేన ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆగస్టు 1న తొలి టెస్టు ప్రారంభమయ్యే ముందు టీమిండియాను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా వారు తిరస్కరించారు. దీంతో మాల్యాకు కోహ్లి సేనను కలిసే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో మాల్యా లండన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది సమయం ముందు మాల్యా స్టేడియం లోపలికి వెళ్లాడు.
దర్జాగా లండన్ టెస్టుకు మాల్యా
