- ఆస్ట్రేలియా-ఏతో అనధికార టెస్ట్
బెంగళూరు : ఆస్ట్రేలియా- ఏతో జరిగిన నాలుగురోజుల అనధికార టెస్ట్‌లో భారత్-ఏ 98 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓడింది. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్-ఏ 163 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులతో బుధవారం ఇన్నింగ్స్‌ను ఆరంభించి మిగతా ఎనిమిది వికెట్లను వంద పరుగులకే కోల్పోవడం గమనార్హం. మయాంక్ అగర్వాల్ అత్యధికంగా 80 పరుగులు చేయగా... ఏడుగురు బ్యాట్స్ మన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్ హోలాండ్ 81 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఇండియా-ఏ అనూహ్య ఓటమి
