- 45 బంతుల్లో 92 బెంగళూరుపై రాజస్థాన్ విజయం
బెంగళూరు : రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ సామ్సన్ ఆదివారం విజృంభించాడు. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసాడు. కేవలం 45 బంతుల్లోనే 10 సిక్స్‌లు, 2 ఫోర్లతో 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య సాధనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు 19 పరుగులతో ఘనవిజయం సాధించింది.
ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌లో కెప్టెన్ రహనే దూకుడుగా ఆడాడు. 20 బంతుల్లోనే సిక్స్, 6 ఫోర్లతో 36 పరుగులు చేసి రహనే తొలి వికెట్‌గా అవుటయ్యాడు. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన సామ్సన్ బెంగళూరు బౌలర్లకు మరింతగా చక్కలు చూపాడు. వరస బౌండరీలతో హోరెత్తించాడు. మరో వైపు రాజస్థాన్ జట్టులో షార్ట్ (11) నిరాశ పర్చినా, స్టోక్స్ 27 పరుగులు, బట్లర్ 23 పరుగులు చేశారు. త్రిపాఠీ 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
లక్ష్య సాథనలో బెంగళూరు ప్రారంభంలోనే మెక్ కల్లమ్ (4) వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లి 30 బంతుల్లో 2 సిక్సలు, 7 ఫోర్లతో 57 పరుగులు చేసి 11వ ఓవర్లో మూడో వికెట్‌గా అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 35 పరుగులు చేశాడు. మాన్దీప్ సింగ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
జూలు విదిల్చిన సంజూ
