- 60 బంతుల్లో 104 పరుగులు చేసిన హషీమ్ అమ్లా
- ఐపిఎల్ 10లో రెండో సెంచరీ
- రాణించిన మ్యాక్స్‌వెల్
- ముంబయిపై పంజాబ్ భారీ స్కోరు
ఇండోర్ : ఐపిఎల్ 10లో భాగంగా గురువారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ అమ్లా పరుగుల సునామీ సృష్టించాడు. తన కెరీర్లో తొలి టి20 సెంచరీ అందుకున్నాడు. ముంబయి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ పరుగుల వరద పారించాడు. 60 బంతుల్లో 6 సిక్స్‌లు, 8 ఫోర్లతో 104తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 40 పరగులతో రాణించాడు.
భారీ లక్ష్యసాధనకు దిగిన ముంబాయికి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి ముంబయి స్కోరు 68 పరుగులకు చేరుకుంది. అయితే తరువాత ఓవర్లోనే ఓపెనర్ పార్థీవ్ పటేల్ నిష్క్రమించాడు. 18 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో పార్థీవ్ 37 పరుగులు చేశాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ముంబయి 117 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబాయి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో మార్ష్ రెండు ఫోర్లు సాధించడంతో 11 పరుగులు వచ్చాయి. తొలి మూడు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 26 పరుగులకు చేరుకుంది. ఐదో ఓవర్లో అమ్లా తొలి సిక్స్ సాధించాడు. ఈ ఓవర్ ముగిసే సరికి స్కోరు 39కు చేరుకుంది. అయితే ఆరో ఓవర్లో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. మెక్లింగన్ బౌలింగ్‌లో పోల్డార్కు క్యాచ్ ఇచ్చి పోలార్డ్ అవుటయ్యాడు. 21 బంతులు ఆడిన మార్ష్ ఐదు ఫోర్లతో 26 పరుగులు చేశాడు. అమ్లాకు షాహా జతకలిశాడు. ఆరు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. ఈ దశలో పంజాబ్ బ్యాట్స్మెన్లు భారీ స్కోరు చేయకుండా ముంబాయి బౌలర్లు కట్టడి చేశారు. దీంతో తొలి 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు వికెట్ నష్టానికి 69 పరుగులు. అమ్లా 32 పరుగులు (27 బంతుల్లో సిక్స్, ఫోర్), షాహా 9 పరుగులు (12 బంతులు) క్రీజ్‌లో వున్నారు. 11 ఓవర్లో కునాల్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతిని అమ్లా సిక్స్‌గా మలిచాడు. కానీ ఈ ఓవర్లో చివరి బంతికి షాహాను పాండ్యా బౌల్డ్ చేశాడు. 15 బంతులు ఆడిన షాహా 11 పరుగులు చేశాడు. ఈ ఓవర్ ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అమ్లాకు కెప్టెన్ మ్యాక్స్‌వెల్ జత కలిశాడు. 12 ఓవర్లో మలింగా బౌలింగ్‌లో అమ్లా రెండు ఫోర్లు సాధించాడు. ఈ ఓవర్లో దీంతో మొత్తంగా 11 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌తో అమ్లా అర్థ సెంచరీ పూర్తయింది. 34 బంతుల్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో అమ్లా 50 పరుగులు చేశాడు.
13 ఓవర్లో కునాల్ బౌలింగ్‌లో తొలి బంతినే అమ్లా ఫోర్‌గా మలిచాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తంగా 9 పరుగుల వచ్చాయి. ఈ ఓవర్ ముగిసే సరికి పంజాబ్ స్కోరు మూడు అంకెలకు (100) చేరుకుంది. 14లో ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో 4,5 బంతులను మాక్స్వెల్ ఫోర్లుగా మలిచాడు. దీంతో ఈ ఓవర్లో పంజాబ్‌కు 11 పరుగులు వచ్చాయి. ఇక 15వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ శివమొత్తాడు. ఈ ఓవర్లో మెక్లింగన్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచిన మ్యాక్స్‌వెల్ తరువాత 3,4 బంతులను ఫోర్లుగా మలిచాడు. నాలుగో బంతిని మళ్లీ సిక్స్ కొట్టాడు. 5 బంతికి సింగిల్ తీయగా, చివరి బంతికి ఎలాంటి పరుగు లభించలేదు. ఈ ఓవర్లో పంజాబ్‌కు ఏకంగా 28 పరుగులను ముంబయి ఇండియన్స్ జట్టు సమర్పించుకుంది. ఈ ఐపిఎల్ 2017లో ఇది రెండో చెత్త ప్రదర్శన. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులకు చేరుకుంది. కాగా, 16వ ఓవర్లోనూ పంజాబ్ భారీగా పరుగులు సాధించింది. ఈ ఓవర్లో అమ్లా విజృంభించాడు. మలింగా వేసిన ఈ ఓవర్ తొలి బంతికి మ్యాక్స్‌వెల్ సింగిల్ తీశాడు. తరువాత బంతిని అమ్లా సిక్స్‌గా మలిచాడు. మూడో బంతి వైడ్‌గా అదనంగా మరో పరుగువచ్చినా, మూడో బంతిని సిక్స్‌గా బాదాడు. నాలుగో బంతిని బౌండరీగా మలిచాడు. ఐదో బంతికి ఎలాంటి పరుగు లభించలేదు. చివరి బంతికి అమ్లా మరో పరుగులు సాధించాడు. 16 ఓవర్లో మొత్తంగా 22 పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్ ముగిసే సరికి పంజాబ్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు.17 ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో మూడో బంతికి మాక్స్వెల్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 18 బంతులు ఆడిన మాక్స్వెల్ మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 40 పరగులు చేశాడు. అమ్లాకు స్టొయినిస్ జత కలిశాడు. 17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులు. తరువాత ఓవర్లోనే మెక్లింగన్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి స్టొయినిస్ (3 బంతుల్లో ఒక్క పరుగు) నాలుగో వికెట్‌గా అవుటయ్యాడు. అమ్లాకు అక్షర్ పటేల్ జతకలిశాడు. ఈ ఓవర్ చివరి బంతిని అమ్లా ఫోర్‌గా మలిచాడు. 18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 170. అమ్లా 83 పరుగులతో వున్నాడు. 19 ఓవర్లో అమ్లా ఫోర్‌తో మొత్తంగా 10 పరుగులు లభించాయి. పంజాబ్ స్కోరు 180కు చేరుకుంది. అమ్లా 90 పరుగులకు చేరుకున్నాడు. చివరి ఓవర్లో అందరి దృష్టి అమ్లాపై వుంది. మలింగా బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతినే అమ్లా సిక్స్‌గా మలిచాడు. రెండో బంతినీ అదే బాట పట్టించాడు. అమ్లా సెంచరీ పూర్తయింది. టీ20ల్లో అమ్లాకు ఇది తొలి శతకం. తరువాత బంతులకు వరుసగా 1,2,1,1 పరుగులు లభించాయి. చివరి ఓవర్లో మొత్తంగా 18 పరుగులు లభించాయి. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ నాలుగు వికెట్లు నష్టానికి 198 పరుగులు చేసింది. అమ్లా 104 పరుగులు (60 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు), అక్షర్ పటేల్ 4 పరుగులు (5 బంతులు) నాటౌట్‌గా వున్నారు.
స్కోరు బోర్టు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
అమ్లా నాటౌట్ 104, మార్ష్ (సి) పోలార్డ్ (బి) మెక్లింగన్ 26, షాహా (బి) కునాల్ పాండ్య 11, మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 40, స్టొయినిస్ (సి) పోలార్డ్ (బి) మెక్లింగన్ 1, అక్షర్ పటేల్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం (20 ఓవర్లు, నాలుగు వికెట్లు) 198
వికెట్ల పతనం : 1-46, 2-80, 3-163, 4-166.
బౌలింగ్ : హర్థిక్ పాండ్య 2-0-18-0, మెక్లింగన్ 4-0-46-2, హర్బజన్ 2-0-12-0, మలింగ 4-0-58-0, కునాల్ పాండ్య 4-0-29-1, బుమ్రా 4-0-30-1.
సూపర్ సెంచరీ
