జీతం
రంగ : ఇప్పుడైనా నా జీతం పెంచండయ్యా
యజమాని : ఏం ఎందుకని?
రంగ : నాకు పెళ్లి చేస్తున్నారయ్యా.
యజమాని : బయట జరగబోయే ప్రమాదాలకు నేను బాధ్యత ఎలా వహించను!
మీటరు
రాము : ఆటో! స్టేషన్కి వస్తావా?
ఆటోవాలా : జోరుగా వర్షం కురుస్తోంది. మీటరుపై ఏదైనా..
రాము : సర్లే పద.. మీటరు మీద ఈ తువ్వాలు వేసుకో!
క్లాసులు
తండ్రి : చింటూ! క్లాసులు బాగా జరుగుతున్నాయా?
చింటు : నేను చేరినప్పటి నుంచి ఒక్క అంగుళం కూడా జరగలేదు నాన్నా!
డ్రిల్
సువర్ణ : పొద్దున్నుంచి ఆటలే ఆడుతున్నావు. వచ్చి హోం వర్క్ చేసుకో.
రాము : ఇది కూడా హోం వర్కే అమ్మా. మా డ్రిల్ మాష్టారు ఇచ్చారు!
కొత్త విషయాలు
టీచర్ : న్యూటన్ చెట్టు కింద కూర్చుని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి నీకేమి అర్థమైంది.
చింటు : ఇలా క్లాసులో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని తెలిసింది... టీచర్.
హోమ్ వర్క్
టీచర్ : ఏ రోజు పని ఆ రోజే చేయడం తెలివైనవారి లక్షణం అర్థమైందా..?
చింటు : అర్థమైంది టీచర్..! రేపటి హోమ్ వర్క్ రేపే చేయాలి.. ఈ రోజు చేయకూడదని..
ఉరి
జైలర్ : నీకు ఈ రోజే ఉరి శిక్ష వేస్తాం. చివరి కోరిక ఏంటో చెప్పు?
ఖైదీ : అయితే నన్ను తలకిందులుగా ఉరి తీయండి సార్..!
ఫెయిల్
సుశీల : ముఖం మీద తువ్వాలు కప్పుకుని తిరుగుతున్నావేం?
బిట్టు : పరీక్షలో ఫెయిల్ అయితే నాన్నగారు ముఖం చూపించొద్దన్నారని..!
దొంగ
ఇన్స్పెక్టర్ : దొంగ ఆ గదిలోకి వెళ్లాడని తెలిసినా పట్టుకోలేకపోయావు?
కానిస్టేబుల్ : గది బయట ఇతరులు లోనికి పోరాదు అని బోర్డు రాసుంది సార్!