పిల్లలు మీరు రకరకాల పక్షుల గురించి తెలుసుకుంటుంటారు కదా. మరి మీకు కాసోవరి పక్షి గురించి తెలుసా?
- ప్రపంచంలో అత్యంత బరువైన పక్షుల్లో కాసోవరి ఒకటి.
- అంతే కాదు అత్యంత పురాతన పక్షిజాతిగా కూడా ఇవి గుర్తించబడ్డాయి.
- ఇవి న్యూ గునియాతోపాటు ఈశాన్య ఆస్ట్రేలియా, ఉత్తర ఆస్ట్రేలియాలోని వర్షపు అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
- ఇవి 6.5 అడుగుల ఎత్తు 60కె.జిల బరువును కలిగుంటాయి.
- ఇవి బరువు కారణంగా ఎక్కువ ఎత్తు ఎగరలేవు. అయితే ఇవి వేగంగా పరిగెత్తగలవు.
- ఇవి గంటకు 50కి.మీ వేగంతో పరిగెడతాయి.
- ఇవి అనవసరంగా ఇతర పక్షుల జోలికి వెళ్ళవు. అయితే అత్యవసర సరిస్థితుల్లో ఇవి బాగా తలపడతాయి.
- వీటి తల భాగం నీలిరంగులోనూ, మిగిలిన శరీర భాగం దట్టమైన నలుపు రంగు ఈకలను కలిగుంటుంది. మెడ నుంచి టై ఆకారంలో ఎరుపు రంగు తోలు వేలాడుతుంటుంది.
- ఇవి కొప్పు భాగంలో బూడిదరంగులో ఒక పదునైన కొమ్ము లాంటి ఆకృతిని కలిగుంటాయి.
- అడవుల్లో నివసించే కొన్ని తెగలు వీటి కాలి ఎముకలు, గోర్లతో బాణాలు పదునైన ములుకులు తయారుచేస్తుంటారు.
- శరీరంపై దట్టమైన ఈకల్ని కలిగుండే ఈ పక్షులు టర్కీ పక్షులను పోలుంటాయి.
- ఆడవాటికంటే మగ పక్షులు ఎక్కువ బరువుంటాయి.
- ఇవి ఎక్కువగా పళ్ళు, కీటకాలు, నత్తలు, చిట్టెలుకలతోపాటు, కప్పలను ఇష్టంగా లాగించేస్తాయి.
- స్పష్టమైన కంటి చూపును కలిగుండే ఈ పక్షులకు వినికిడి శక్తికూడా ఎక్కువే. మైళ్ళదూరం నుంచి ఇతర కాసోవరిలు చేసే చిన్న చిన్న శబ్దాలను కూడా ఇవి ఇట్టే పట్టేస్తుంటాయి.
- ఇవి ఎక్కువగా ఒంటరిగా ఉండేదుకే ఇష్టపడుతుంటాయి.
- ఇవి 12-19 ఏళ్లు జీవిస్తాయి.
- జూన్-అక్టోబర్ మధ్యకాలంలో ఐదు వరకు గుడ్లుపెడతాయి.
- అడవుల నరివేత కారణంగా ప్రస్తుతం కాసోవరిల సంఖ్య తగ్గిపోతోంది.
ొఅత్యంత ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్న ఈ పక్షుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2000 మాత్రమే!.
కాసోవరి
