మనపై కురిసిన ఏకాంతాలు
పెదవుల వంకీ వసారాల్లో
కలల్ని పురివేసి
బొండుమల్లెల్ని పరచాయి
అది నీ మేనిమానుకు
నేను 'వేరు' నైన కాలం
రేఖలు వృత్తాలై పరిధుల్ని పరిమితం చేశాక
అలసిన దిక్కుల రెక్కల మధ్యన ఆకాశం గాయపడింది
ఇప్పుడు 'వేరైన' ఏకాంతం దగ్ధానంతర దైన్యమయ్యింది
-కళ్యాణదుర్గం స్వర్ణలత
98486 26114
వేరు
