2050 నాటికి సముద్రాల్లో జీవజాతుల కంటే పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ వ్యర్థాలే పేరుకుపోతాయనేది వరల్డ్ ఎకనామిక్ ఫారం అందించిన నివేదిక. అది నిజం కాకుండా ఉండాలంటే దానికి మనమే కృషిచేయాలి. తీర ప్రాంతాల పరిరక్షణ పట్ల కాస్త బాధ్యతగా ప్రవర్తించాలి. ఇదే అఫ్రోజ్ ఫిలాసఫీ. ఆ దిశగానే తన పయనం మొదలయ్యింది. 2015లో ముంబయి సముద్ర తీర ప్రక్షాళనకి బీజం పడింది. తను చేపట్టిన ఓ మంచి పని అతి పెద్ద సముద్రతీర పరిరక్షణా కార్యక్రమంగా యుఎన్ ద్వారా గుర్తించబడింది. ఇప్పటి వరకు వెర్సోనా తీర ప్రాంతంలో 4300 టన్నుల ప్లాస్టిక్నితొలగించాడు. చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని గెలుచుకున్న అఫ్రోజ్ ప్రకృతి పరిరక్షణ కోసం ఏం చేస్తున్నాడో మీరూ తెలుసుకోండి.
ముంబరు హైకోర్ట్‌లో లాయర్‌గా పనిచేస్తున్నాడు అఫ్రోజ్‌షా. మార్నింగ్ వాక్ కోసం వెర్సోవా బీచ్‌కి వెళ్లిన తనకి కనుచూపుమేరలో ఆ ప్రాంతమంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో కనిపించింది. బీచ్ నుంచి కాస్త పక్క కొచ్చి పుట్వాక్ మీద నడక మొదలు పెట్టాడు. అక్కడ కూడా దారిపొడవునా తనకి ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయి. ప్రకృతి పరిరక్షణలో తానూ భాగస్వామి అనే విషయం తనకి తెలుసు. అందుకే ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఈ సమస్యపై పారిశుధ్య అధికారులకి కంప్లైంట్ చేయడం, హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)వేయాడం ఇలా చాలా ఆలోచనలే మెదిలాయి. అయితే సమస్యని పరిష్కరించుకోడంలో ఎక్కువ సమయం లేదు. పరిస్థితి చేయిదాటాక మనం చేయగలిగేది ఏం లేదనిపించిందతనికి. ప్రశ్నించాలనుకునే ఆలోచన మాని 2015లో తన మిత్రుడితో కలిసి పని మొదలు పెట్టాడు. అలా తొలిరోజు ఇద్దరూ కలిసి సముద్రతీరంలో పడివున్న చెత్తని సుభ్రంచేశారు. ఆ ఒక్కరేజు వాళ్లు పోగుచేసిన చెత్త ఐదు బస్తాలైంది. అది ఇద్దరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుంచి ఇద్దరు శని ఆది వారాలని ఈ పనికోసం కేటాయించేవారు. 2.9కిమి పొడవున వున్న బీచ్ ప్రక్షాళన పనుల్లో వీరికి సాయపడేందుకు మరికొందరు ముందుకొచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా బీచ్‌కి దక్షిణ ప్రాంతంలో కాల్వ పూడుకుపోయింది. మురుగు నీరు ద్వారా వచ్చే దుర్గంధం ప్రభావాన్ని మొదటగా ఎదుర్కొనేది దగ్గరలో మురికి వాడలో నివాసం వుంటున్నవారే. వాలంటీర్ల సాయంతో ఆ పరిసరాలని సుభ్రంచేయడంతోపాటు స్థానిక మురికి వాడలో పరిశుభ్రతపై అవగాహనా సదస్సులని నిర్వహించేవారు. ఇలాంటి సమస్యలని పరిష్కరించడానికి ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి కదా మీరెందు ఇలాంటి పనులన్నీ నెత్తినేసుకుంటున్నారంటూ చాలామంది అఫ్రోజ్‌ని ప్రశ్నించేవారు. మున్సిపాలిటి పనిచేస్తున్నాడంటూ ఇంకొందరు నవ్వుకునేవారు. అయితే చట్టాలు, అధికారుల ఉత్తర్వులకంటే చైతన్యం మనలో మొదలవ్వాలంటారు అఫ్రోజ్. వినోభా భావే చిప్కో మూమెంట్ మంచి ఫలితాలు సాధించడానికి కూడా ఇలాంటి కార్యాచరణే కారణమయ్యింది. పర్యావరణ పరిరక్షణలో తనకు కొందకు మత్స్యకారులూ సాయపడ్డారు. రెండేళ్ల క్రితం ఇద్దరితో మొదలైన వెర్సోనా బీచ్ ప్రక్షాళన అందరి సహకారంతో ఒక సంఘటిత కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు మొత్తం 4300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలని సేకరించారు. ప్రస్తుతం 90 శాతంగా తీరప్రాంతాన్ని శుభ్రపరిచారు. యుఎన్ పర్యావరణవేత్తలు సైతం వీటిని పరిశీలించారు. తన కృషికిగాను 'చాంపియన్ ఆఫ్ ది ఎర్త్' అవార్డుని అందుకున్నాడు. ముంబయిలో అత్యంత ప్రమాదకర స్థితిలో వున్న 19 బీచ్‌లలో ప్లాస్టిక్ వ్యర్ధాలని తొలగించాలనే భవిష్యత్ కార్యాచరణ మొదలయ్యింది.
బీచ్‌ని మార్చాడు
