రచయిత గురవారాపు కొడుకు వీరేశం కూతురికి ప్రేమ లేఖ రాశాడు. అది చదివిన వీరేశం కోపంగా గురువారావు దగ్గరకు బయల్దేరాడు.
''చూశారా మీ అబ్బాయి ఏం చేశాడో?
మా అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు చెప్పాడు వీరేశం కోపంగా.
''రిప్లై కవర్ పెట్టాడా?'' అడిగాడు రచయిత గురవారావు.
పొదుపరి
భార్య: చీర కొనుక్కుంటాను, వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చు పెడతానని కోతలు కోశారు. నిలదీసింది భర్తని.
భర్త: ఓసి పిచ్చిదానా నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.
మందు
రామారావు ప్రతిరోజు బార్కెళ్ళి మందు తాగుతాడు . ప్రతిరోజు రెండు గ్లాసులు ఆర్డర్ ఇచ్చి పక్క పక్కనే పెట్టుకుని ఒక సిప్పు ఒక గ్లాసులోంచి, మరీ సిప్పు చేసి రెండో గ్లాసులోంచి తాగుతాడు ఈ తతంగం అంతా చాలా రోజులు నుంచి చూసిని సర్వర్ ఆనందం ఒక రోజున రామారావుని అడిగేశాడు.
నేను ఎప్పుడు మందు నా స్నేహితుడి సుబ్బారావుతో కలిసి తాగేవాడిని. వాడు ప్రమాదవ శాత్తు చనిపోయాడు. అతని జ్ఞాపకార్థం రెండు గ్లాసులు తాగుతున్నాను.
కొంత కాలం తరువాత రోజు ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యడం మొదలు పెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?
'లేదయ్యా నేను మందు మానేశాను'. చెప్పాడు రామారావు.
ప్రేమ
రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. చెబుతున్నాడు చింతామణి
అబ్బా మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.
మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా. అసలు విషయం చెప్పాడు చింతామణి.
మీరు కనిపెట్టారా?
ఒక రైల్లో జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.
'కిళ్లీ ఉమ్మడానికి కూడా కదిలే వీల్లేకుండా వుంది' మొహం వెనక్కి తిప్పి తన వెనక నిల్చున్న ప్రయాణికుడితో అన్నాడు గోవిందు.
'మీ ముందున్న వాడి వెనక జేబులో ఊసేయండి' మెల్లగా సలహా ఇచ్చాడాయన.
'ఆయనికి తెలిస్తే..' కిళ్లీ తుంపర్లు మీద పడకుండా అన్నాడు గోవిందు.
'తెలీదు. నేను ఊసింది మీకు తెలిసిందా?' అడిగాడు ప్రయాణికుడు.
జర్మనీ
టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ అంటూ పాఠం చెబుతోంది టీచర్
నాకు తెలుసు టీచర్ చెప్పాడు బంటీ.
ఏమంటారు
జెర్మ్స్్ జవాబిచ్చాడు బంటీ
ఆవు వ్యాసం
నాన్న: ఒరేరు ఆవు మీద కూర్చుని ఏం చేస్తున్నావురా?
కొడుకు: మాష్టారు ఆవు మీద వ్యాసం రాసుకురమ్మన్నారు. అందుకని!