'కథ్పుత్లీ' ప్రయోగాత్మక లఘుచిత్రం... ఉన్నది రెండు చేతులే అయినా.. అనేక పనులతో సతమతమయ్యే ఓ గృహిణి కథే ఇది. ఇంట్లో ఓ తోలుబొమ్మలా ఆమె దినచర్య ఎలా ఉంటుందో..! ప్రతి పనినీ నవ్వు పులుముకుని ఎలా ముగిస్తుందో...! తీరికలేమితనం, బాధ్యతలు ఇవన్నీ ఈ చిత్రంలో హృద్యంగా చూపిస్తారు. తోలుబొమ్మ తీగెల్ని సింబాలిక్‌గా ఆమె పరిస్థితికి వాడారు. తనకెంతో ఇష్టమైన, అత్యవసరమైన చదువుకు ఆమె ఎలా దూరమవుతుందనే విషయాన్ని చూపిస్తారు. చివరకు తాను ఎలా బయటపడింది.. అప్పటి ఆమె భావోద్వేగాన్ని ఎలా చూపించారనేది...? ఆకట్టుకునే విషయం. రజత్ అగర్వాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎన్నో అవార్డుల్ని గెలుచుకుంది. కేన్స్ కోర్ట్ మెట్రేజ్లో ప్రదర్శించారు. తోలుబొమ్మగా నటించిన భూమికా భోస్లే చివరి దృశ్యంలోని హావభావాలకు చప్పట్లు కొడతాం. ధర్మేంద్ర కుమార్ గుప్తా స్టోరీ కాన్సెప్ట్నిచ్చారు.
తోలుబొమ్మ కాదు..!
