పిల్లలూ! మీరు రకరకాల జంతువుల గురించి తెలుసుకుంటుంటారు కదా. మరి మీరెప్పుడైనా క్వాల్ అనే జంతువు గురించి విన్నారా?.
- ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూ గునియా, టాస్మానియా దేశాల్లో కనిపిస్తాయి.
- మొత్తం ఆరు జాతులుగా ఉన్న క్వాల్స్లో ప్రస్తుతం మనుగడ సాగిస్తోంది నాలుగు మాత్రమే.
- పగలంతా చిన్న చిన్న బొరియలు పొదల్లో సేదతీరుతుండే ఈ జంతువులు రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి.
- క్వాల్లు దాదాపు నలభై లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఆస్ట్రేలియాలో మనుగడ సాగిస్తున్నాయనే ఆధారాలున్నాయి.
- ఇవి నలుపు/ గోధుమ రంగు బొచ్చుతోపాటు శరీరంపై వలయాకారంలో తెల్లని మచ్చల్ని కలిగుంటాయి. కాస్త ఎలుకల్ని పోలుండే ఈ జంతువులు బారాటి తోకతో మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి.
- ఇవి దాదాపు ఏడు కిలోల బరువుంటాయి.
- చిన్న చిన్న పక్షులు, క్షీరదాలు, బల్లులు, కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.
- బ్రిటిష్ నావికుడు కెప్టెన్ కుక్ తన ఆస్ట్రేలియా అన్వేషణలో భాగంగా 1770లో వీటిని సేకరించి పెంచుకోవడం మొదలుపెట్టాడట.
- అడవి పిల్లులు, నక్కల బారిన పడి పెద్ద సంఖ్యలో మృతిచెందుతుండటంతో ప్రస్తుతం వీటి మనుగడ ప్రమాదకర స్థితికి చేరుకుంది.
క్వాల్
