పుస్తకం : అహానికి రంగుండదు
రచయిత : పి. చంద్రశేఖర్ అజాద్
పేజీలు : 135, ధర : 110
ప్రతులకు : విశాలాంధ్ర, నవచేతనా, నవోదయ బుకహేౌస్ కేంద్రాలు
సెల్ నెం: 9246573575
''రెండు తొడకండరాల మధ్య రాపిడి కోసం నువ్వు తపిస్తున్నావు'' అనే మాట ఎంత మొరటుగా, నగంగా వినిపిస్తుందో 'అహం' కూడా అంతే నిజమైనది. ఈ నిజంతోనే పి.చంద్రశేఖర ఆజాద్ రాసిన ''అహానికి రంగుండదు'' నవల మొదలవుతుంది. ఒకడు కమ్యూనిస్టు కావాలని క్యాపిటలిస్ట్గా మారితే జరిగే విధ్వంసమిది. క్యాపిటలిస్ట్ కమ్యూనిటీని చూసే విధానమిది. అహానికి సంబంధించిన ఒకానొక విశ్వరూపం. ప్రధాన పాత్ర విష్ణు స్వగతంలో కనిపించే వివిధ పాత్రల్లో ప్రశ్నలుగా అజరు కుటుంబం, ప్రోద్భÛలంగా ప్రేయసి లహరి. ఎవరి అహం వారిది.
'కలర్స్ ఆఫ్ లైఫ్' ఏంటో విష్ణుకి తెలుసు. అయితే తనని తాను నియంత్రించుకునే ప్రయత్నాలు చేయలేదు. ఓ దశ వరకు గుంభనంగా బతికాడు. తర్వాత నగంగా, అరాచకంగా మారాడు. ఎవరేమనుకున్నా తన అహాన్ని తృప్తిపరచుకోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అందరి దృష్టిలో ఏ సెంటిమెంటూ లేనివాడుగా తయారయ్యాడు. ''ఒక పొరపాటుకి కొన్ని దశాబ్దాలు ప్రజలు బాధపడాలి. కమ్యూనిస్టులు వాటిని చారిత్రక తప్పిదాలు అంటారు''. ఆ తప్పిదమే చేసానని ఒప్పుకున్నాడు విష్ణు. ''నేను అనేక వైరుధ్యాల పుట్టని. అది ఇంతకు ముందు తెలుసు. ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తోంది. అయినా చాలా అలస్యం అయిపోయింది. ఈ జీవితం నుంచి నేను వెనక్కి రావడం అసాధ్యం... నేను బతికి ఉన్నానని మీరు అనుకుంటున్నారు. అయితే, చనిపోయానని నేను అనుకుంటున్నాను''. అందుకే వెళ్లి అజరు ముందు కూర్చుంటాడు. అతని ''దృష్టిలో బతకడం అంటే పనిచేయడం''. విష్ణు ఏ పని చేయలేదు. పెట్టుబడిపెట్టి లాభాలు మాత్రం తీసుకున్నాడు. తన పతనానికి కారణం తనకి తెలుసు. కానీ, అంతరంగం మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. మిగతా వారికి, మనకూ మధ్య తేడా ఉంది. వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేయగలరు. మనం అలా చేయలేం. మన దగ్గర డబ్బు ఉండొచ్చు. అయినా విలాసవంతంగా బతకలేం. అది మన కార్యకర్తల్లోనే ఓ అసంతృప్తికి దారి తీస్తుంది. అంతేకాదు, హోల్ టైమర్స్కి ఇచ్చే డబ్బు చాలా చిన్న మొత్తం ఎంతో పొదుపుగా బతకాలి. మనకు ఆశయం ఉంది. అదే మన పిల్లలకి ఉండాలని లేదు. మనం వారికి ఎంత చెప్పినా బయటి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ సమన్వయం చేసుకోవటం చాలా కష్టం''. విష్ణు ఇలా సమన్వయం చేసుకోకుండా బతికాడు. దానికి కారణం లేకపోలేదు. అదే.. అతని అసంతృప్తి? లహరి. దాన్ని తృప్తి పరుచుకోవడానికే తపించాడు. చివరికి ఏమయ్యాడు? అతడి అహం పశ్చాత్తాపం పడనిస్తుందా?.ఓ మనిషి సంఘర్షణని చెప్పే నవలిది. సిద్ధాంతాలకు ఎంత బలంగా మనిషి తయారవ్వాలో.. దారి తప్పించే ఆకర్షణలకు ఎలా లొంగిపోకూడదో వివరిస్తుంది.
- ప్రవీణ్ వెలువోలు
మనిషి కథంటే అహమే
