అరగంట ఛార్జింగ్‌తో 643 కి.మీ. నడిచే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించింది. ఇది మోటార్ సైకిళ్ల తయారీలో పేరున్న సంస్థ కూడా కాదు, స్టార్టప్‌గా మొదలై ఇపుడు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో అద్భుతాన్ని సృష్టించింది. పెట్రోల్ ఇంజన్ గల బైకులకు కూడా సాధ్యం కాని రీతిలో పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు... మైలేజ్, స్పీడ్, డిజైన్లతో పాటు ఇతర ఫీచర్లతోనూ ఎలక్ట్రిక్ బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్టప్ విగో మోటార్ సైకిల్స్ ఈ ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే బైకును నిర్మించింది. ఇది గరిష్టంగా గంటకు 290 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. దీని మొత్తం బరువు 160 కిలోలు. 120 బిహెచ్పి పవర్ ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో... కేవలం 3.2 సెకన్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ సూపర్ బైక్ ఒకసారి ఛార్జింగ్ అయితే నిరంతరాయంగా 643 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని విగో మోటార్ సైకిల్స్ బృందం చెబుతోంది. దీనికి 21కిలోవాట్స్పవర్ బ్యాటరీని అనుసంధానం చేశారు. దీనిని కేవలం 30 నిమిషాలలోపే పూర్తి స్థాయిలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ మార్కెట్లో 7,999 యూరోలు పలుకుతోన్న ఈ బైక్ ధర... మనదేశంలో సుమారుగా రూ.6.71 లక్షలు ఉండే అవకాశం ఉంది.
అరగంట చార్జింగ్‌తో 643 కిమీలు
