సాధారణంగా కొన్ని ఇంగ్లీష్ పదాలు రాయడం వచ్చినా పలకడంలో తడబడుతుంటాం. పిల్లకైనా, పెద్దలకైనా కొన్ని పదాలను ఎలా పలకాలో తెలియకపోవచ్చు. మరికొన్ని పదాల్లో సైలెంట్ అక్షరాలు కానీ, వాటి ఉచ్ఛరణ కానీ వేరుగా ఉండొచ్చు. ఒక పదాన్ని ఎలా పలకాలో, ఎలా రాయాలో తెలుసుకోడానికి http://www.text2speech.org అనే వెబ్సైట్ ఉపయోగపడుతుంది. మనం ఏ పదం, ఏ వాక్యం ఉఛ్చరణ తెలుసుకోవాలనుకుంటున్నామో, ఆ పదం లేదా వాక్యంను ఈ సైట్‌లోని టెక్ట్స్ బాక్సులో టైప్ చేయడం గానీ లేదా వేరేచోట కాపీ చేసుకొని పేస్ట్ చేయడం గానీ చేయాలి. దీని కిందే వున్న 'వాయిస్' అనే బాక్సు నుంచి ఏ తరహా ఉఛ్చారణ కావాలో ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాతి ఆప్షన్ 'టాకింగ్ స్పీడ్' ద్వారా ఆ మాటలు ఎంత వేగంతో పలకాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత 'స్టార్ట్' బటన్ నొక్కాలి. అప్పుడు ఆడియో ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్‌ను అప్పటికప్పుడు ప్లే చేసుకొని వినొచ్చు. ే ఎంపీ3 ఫార్మెట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోండిలా...
