ఇటీవల కాలంలో ఊయలలూగే నా హృదయం అంటూ అమ్మలైనా, నాన్నలైనా తమ బిడ్డల్ని ఓ ప్రత్యేక బ్యాగ్ రూపంలో తమ ఎదపై కట్టుకుంటున్నారు. సహజంగా ఈ దృశ్యాలను మనం గ్రామీణ, కొండ ప్రాంతాల్లో చూస్తాం. పల్లెప్రాంతాల్లో పనులు చేసుకునే మహిళలు చిన్నపిల్లలను చీరతో చుట్టి వీపుమీద మోస్తుంటారు. ఈ సంస్కృతి నుంచి వచ్చినవే బేబీ క్యారియర్లు. ప్రస్తుతం ఈ ట్రెండ్ విదేశాల్లో బాగానే విస్తరించింది. ఇప్పుడు ఆధునికంగా నేటితరం అమ్మల్నీ ఆకట్టుకుంటోంది. కానీ వీటి అవసరాన్ని గుర్తించి, బేబీక్యారియర్లు తయారుచేసే ఒక స్టార్టప్‌ను లిటిల్వింగ్స్ పేరుతో మొదలుపెట్టారు ముంబయికి చెందిన ప్రియా కత్పాల్, పూజా కరంబెల్కర్. వీళ్లిద్దరికీ ఏడాది వయస్సున్న పిల్లలున్నప్పుడు ఈ ఆలోచన తట్టింది. దాన్నే వ్యాపారంగా మొదలుపెట్టారు. వ్రాప్స్, రింగ్ స్లింగ్స్, ఫుల్బకెల్ క్యారియర్లు, ప్రీ స్కూల్ క్యారియర్లు... ఇలా చాలా డిజైన్లలో ఈ విభిన్న క్యారియర్లను అందుబాటులోకి తెచ్చారు. అవసరం, పిల్లల బరువూ, వయసు బట్టి మనమే వాటిని నచ్చినట్లు తయారు చేయించుకోవచ్చు. పిల్లలు ఎదిగే తీరుని బట్టి పరిమాణం పెంచుకునే అవకాశమూ ఉంటుంది. ఇలాంటివి ఇప్పుడు మార్కెట్లోనూ అందుబాటులో ఉన్నాయి.
అమ్మ ఎదపై ఊయలూగే ...
