- సొసైటీలుగా ఏర్పడినా ఫలితం లేదు శ్రీ 101 జిఒను సవరించాలి
రజక వృత్తిదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాలకుల దృష్టికి అనేక సందర్భాల్లో సమస్యలు వివరించినా స్పందించడం లేదు. సొసైటీలుగా ఏర్పడితే రుణాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో అమలు చేయడం లేదు. 101 జిఒ ఆధారంగా అనేక ఆంక్షలు పెట్టడంతో రుణాలు పొందే అర్హత పొందలేక పోతున్నారు. దోబీఘాట్ల నిర్మాణానికి కూడా నిబంధనలు పెట్టింది. గ్రామాల్లో నీరు ఉన్న చోటికి వెల్లి బట్టలు ఉతకడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. దోబీఘాట్ల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురయినా పాలకులు పట్టించుకోవడం లేదు. నిర్మించిన చోట నాసి రకంగా ఉండటం వల్ల నిరుపయోగంగా మారుతున్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో కులవివక్ష, సాంఘిక బహిష్కరణలు రజకులు ఎదుర్కొం టున్నారు. గ్రామాల్లో ఉపాధి కరువై పట్టణాలకు వచ్చి బండచాకిరి చేసినా సమస్యలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రజకుల సమస్యలపై ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం....
కర్నూలు జిల్లాలో 30 వేల మందికి పైగా రజక వృత్తిదారులు ఉన్నారు. వీరిలో 90శాతం మంది కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. సామాజికంగా అణచబడి వివక్షకు గురవు తున్నారు. దాడులు ఎదుర్కొంటూ దుర్భర జీవనం ఎదుర్కొంటు న్నారు. తమ పిల్లలను చదివించలేక రజక వృత్తిలోకి తెస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిచేసుకోవడానికి కనీస వసతులు లేవు. 54 మండలాల్లో నామమాత్రంగా దోబీఘాట్లు ఉన్నాయి. నందికొట్కూరులో 400 కుటుంబాలుంటే ఒక్కదో బీఘాట్ కూడా లేదు. ఐదుకిలోమీటర్ల దూరంవెళ్లి బట్టలు ఉతికి తెస్తారు. బట్టలు ఆటోలో తీసుకెళ్లి తిరిగి ఊర్లోకి తీసుకురావాలి. దీంతో అదనంగా ఖర్చు అవుతుంది. మద్దికెర మండల పెరవలిలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయి. హంద్రీనీవా కాలువలో బట్టలు ఉతుకుతారు. మహిళలు ఒంటరిగా వెళ్లి బట్టలు ఉతకడానికి ఇబ్బందులు పడుతారు. అడవి జంతువులు సంచరిస్తుంటాయి. బేతంచెర్లలో దోబీ ఘాట్లకు స్థలం ఉంది కాని నిర్మాణాలు చేపట్లలేదు. 2012 నుంచి అనేక సార్లు అధికారుల దృష్టికి తెచ్చారు. ఆ స్థలాన్ని అక్కడి ప్యాక్టరీ యజమాని సగం ఆక్రమించాడు. ఆళ్లగడ్డ, కోవెల కుంట్ల, చాగలమర్రి ప్రాంతాల్లో ఇప్పటికీ దోబీఘాట్లు లేక ఎద్దుల బండ్లపై బట్టలు తీసుకెళ్లి కుంటల్లో ఉతకాల్సి వస్తుంది. ఎమ్మిగ నూరులో రజకులకోసం కేటాయించిన స్థలాన్ని రియల్ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విన్నివించినా ఫలితం లేదు. ఆదోనిలో శాంతిమల్లప్ప చెరువు నాలుగు ఎకరాలు ఉంటుంది. అక్కడ దోబీ ఘాట్లు ఉన్నాయి. 2014 జనవరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయడానికి వెళ్తే అక్కడి రజకులు అడ్డుకున్నారు. అడ్డుకున్న రజకులపై దాడులు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని రజకులన్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రపంచీ కరణ నేపథ్యంలో వృత్తులు కనుమరుగవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి కొనసాగించలేక పోతున్నారు. ఉపాధి కోసం పట్టణ ప్రాంతాల్లో అపార్టు మెంటు వాచ్మెన్లుగా, రోడ్లపైన బంకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మహిళలు ఇంటిపని వారుగా మారుతున్నారు. అపార్టుమెంటులోని వాచ్ మెన్లుగా, ఇతర అన్ని పనులు చేస్తున్నారు. బట్టలు ఉతకడం, కసువు ఊడవడం, కూరగాయలు తేవడం, పిల్లలకు పాఠ శాలలకు వెళ్లి టిఫిన్ క్యారియర్లు ఇచ్చి రావడం తదితర బండ చాకిరీ చేయాల్సి వస్తుంది. ఐదారు అంతస్తులు ఉండే అపార్టు మెంట్లలో చెప్పిన పని చేయలేదని దొంగతనం కేసులు మోపు తూ యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పట్టణాల్లో రజక వృత్తి క్రమంగా పురుషుల కంటె స్త్రీలు ఎక్కువగా చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారుల ఇండ్లల్లోకి వెళ్లి పని చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇంటి పని వాళ్లకు ఇచ్చే తరహాలో రజకులకు కూడా గుర్తింపు కార్డులను ఇవ్వాలి. నాసిరకమైన సబ్బులతో బట్టలు ఉతికడంతో చేతులకు చర్మవ్యాధులు వస్తున్నాయి.
బనగానపల్లె మండలం టంగుటూరులో దేవర గుడికి సున్నం వేసే విషయంలో పెత్తం దారుల మాటలు వినలేదని గ్రామ బహిష్కరణ చేశారు. గడివేముల మండలం మంచాలకట్ట , గని గ్రామంలో మేర పెంచమని అడిగినందుకు రజకులను సాంఘిక బహిష్కరణ చేశారు. కర్నూలు నగరంలో గత ప్రభుత్వం ఆరు దోబీ ఘాట్లను నిర్మించింది. తుంగభద్ర ఒడ్డున సంక ల్బాగ్ వద్ద, 49 వార్డులో , 47 వార్డులో, రోజా వీధి, నాగసాయి దేవాలయం, కోట్ల కిసాన్ఘాట్ వద్ద ఆరు దోబీఘాట్లు నిర్మించారు. లక్షలు వెచ్చించి నిర్మించినా ఒక్కటి కూడా రజకులకు బట్టలు ఉతకడానికి అనుకూలంగా లేవు. రక్షణగోడ లేదు. బోరు , గది తదితర సౌకర్యాలు లేవు. అవి ఇప్పు డు మందు బాబులకు, అసాంఘిక కార్యలకాలకు అనుకూ లంగా మారాయి. దీనిపై ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకో వల్సిన అవసరం ఉంది. బట్టలు ఉతకడానికి అనుకూ లంగా మార్చాలి. అదే విధంగా జిల్లాలో దోబీఘాట్ల స్థలాలను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలి. వృత్తి చేసుకోవడానికి అనుకూలంగా కావల్సిన సౌకర్యాలు కల్పించాలి. అవసరమైన చోట వెంటనే దోబీఘాట్లను నిర్మించాలి. 1982లో రజకుల సంక్షేమ కోసం రాష్ట్రంలో రజక పెడరేషన్ ఐదు లక్ష్యాలతో ఏర్పడింది.
1. దోబీఘాట్ల నిర్మాణం, 2. సొసైటీల ఏర్పాటు, ఆర్థిక సహాయం, 3. ముడిసరుకులు సరఫరా, 4. దోబీఘాట్లనుంచి ఇంటికి బట్టలు తీసుకెళ్లడానికి వాహనాలు ఏర్పాటు చేయాలి. 5. వృత్తిలో ఆధునికత కోసం శిక్షణ ఇవ్వాలని లక్ష్యాలగా పెట్టుకున్నారు. ఇందులో దోబీఘాట్లు, ఆర్థిక సాయం రెండు మాత్రమే అరకొరగా అమలవుతున్నాయి. జిల్లాలో 450 సొసైటీలు హైదరాబాద్ ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్నాయి. అందులో 2013లో 120 సొసైటీలు ఇస్తామని చెప్పి 55 సొసైటీలకు మాత్రమే ఆర్థిక సహాయం చేశారు. 2014-15లో 174 సొసైటీలకు రుణం ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఒక్క సొసైటీకి కూడా రుణం ఇవ్వలేదు. 2015-16 లో 455 సొసైటీలు ఉంటే 88 సొసైటీలకు మాత్రమే రుణం ఇస్తామని ప్రకటించడం బాధాకరం. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టి ఆరునెలలు దాటినా ఆచణలకు నోచుకోలేదు. దీనిని బట్టి చూస్తే రజకుల సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. గత నెల 10న రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి చంద్రన్న బిసి సంక్షే కార్యక్రమానికి వచ్చి సొసైటీలకు రుణాల కోసం ప్రొషీడింగులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఆకార్యక్రమానికి వచ్చిన పొదుపులక్ష్మి గ్రూపులకు మాత్రమే చెక్కులు ఇచ్చారు. వృత్తిపరికరాలు పాతవి సేకరించి ప్రదర్శించారు. లబ్ధిదారులకు ఇచ్చినట్లు ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్టపికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సొసైటీ ఏర్పాటు చేసుకున్న సభ్యులందరికి బ్యాంకుతో సంబంధం లేకుండా 90 శాతం సబ్సిడీతో రుణాలు అందజేయాలి. జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా రజకులు సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి పురోభివృద్ధి సాధించలేదు. సమాజంలో నేటికీ వివక్షకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ తరహాలో ప్రభుత్వం రజకులకు రక్షణ చట్టం రూపొందించి న్యాయం చేయాలి. వయోపరిమితి విధించిన 101 జిఒను సవరించాలి.
పిల్లలను చదివించలేక పోతున్నాం
కర్నూలుకు వచ్చి 15 ఏళ్లు అయింది. ఊర్లో ఉపాధి లేక నగరానికి వచ్చాం. భార్యా భర్తలం ఇద్దరం ఇండ్లల్లో బట్టలు ఉతుకుతాం. ఇప్పటికీ సొం తిళ్లు లేదు. ఇద్దరు పిల్లలను చదివిం చలేక ఒకడిని బడి మానిపించి ఆటో నడుపు తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. మాలాంటి పేదలకు ప్రభుత్వం సహకరించాలి.
- సి రాముడు- కిష్టాపురం-క్రిష్టగిరి మండలం
ప్రతి రోజు కష్టపడినా ఖర్చులకు సరిపోదు
నెలంతా ప్రతిరోజు కష్టపడినా ఖర్చులకు సరిపోదు. 15 ఇండ్లల్లో బట్టలు ఉతికి ఇస్త్రి చేస్తాం. ఇంటికి ఐదువందలు ఇస్తారు. అద్దె ఇంట్లో కర్నూలులో ఉం టున్నాం. నలుగురు పిల్లలు ఉన్నారు. చదు వులకు ఇతర ఖర్చులకు కుటుంబం గడవడం కష్టంగా ఉంది. పిల్లలను ప్రభుత్వ పాఠశా లల్లో చదివిస్తున్నాం.
- సి.సత్యం- వెంకటగిరి కోడుమూరు మండలం