స్నేహ ఆదివారం సంచికలో ప్రపంచ ఆడపిల్లల దినోత్సవం సందర్భంగా వచ్చిన అట్టమీది కథ 'ఆ నవ్వే ప్రగతి' ఆకట్టుకుంది. సమకాలీన కళాప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ఫ్యూజన్ చిత్రాలు ఆశ్చర్యపరిచాయి. ఒకప్పుడు సాకర్ ప్రభంజనాన్ని చూసిన మన ఫుట్‌బాల్ క్రీడ తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవడం ఆనందపరిచింది. ఫుట్‌బాల్ క్రీడలో అంతర్జాతీయ లీగుల్లో దూసుకుపోతున్న క్రీడాకారులకు హ్యాట్స్ ఆఫ్. రోబోటిక్స్‌కు దగ్గరవుతున్న మనిషిని కళ్ళకు కట్టినట్టు చూపిన కవిత 'మరమనిషికి నైవేద్యం', 'విడాకులకు పరీక్ష', 'పరపరా నమిలితే', 'ఓ బొమ్మల పెళ్ళి కథ', 'పచ్చటి కెరటాలు' బాగున్నాయి.
-టి. అర్పిత, అనంతపురం.
ఆ నవ్వే ప్రగతి
