మన మహిళా ముఖ్యమంత్రులు కవర్ స్టోరీ అద్భుతం విజ్ఞాన దాయకం. మహిళలు దేనిలోను తీసిపోరని రుజువు చేస్తున్నారు. జయలలిత, మమతా బెనర్జీలు ఎన్నికల పోరులో అందరికంటే ముందు వరసలో ఉన్నారు. దేశంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సుచేతా కృపలానీ సోషలిస్టు నేత.
- టి. శ్రీరామమూర్తి, విశాఖ
ఆదర్శనీయం
మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు అనడానికి నిదర్శనం. రాజకీయాల్లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ యావత్ భారత్లో చెరగని ముద్రని వేశారు. కాని నేటి ముఖ్యమంత్రులు అవినీతిలో కూరుకుపోతూ తమ ఉనికినే ప్రశ్నార్థకంలా మారుస్తున్న తీరు బాధాకరం.ప్రపంచం నర్తిస్తే వ్యాసం చాలా బాగుంది. వివిధ జాతులకు, తెగలకు చెందిన నృత్యాలను వివరించడం బాగుంది. థింసా, గిరిజన సంప్రదాయాలను కాల క్రమేణా అభివృద్ధి చెంది ఆధునిక స్టెప్పులతో మన ముందున్నాయి.
- రాము, కడప
మాయా చిత్రాలు
సినిమాల్లో వాస్తవాలుగా కనిపించే ఎన్నో మాయా చిత్రాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రపంచం మొత్తం మీదా వివిధ రూపాల్లో ఉండే నృత్యాల ప్రస్థానం ఆకట్టుకుంది. భారత దేశపు స్త్రీ శక్తి ప్రపంచదేశాలకు చాటిచెప్పిన ''మన మహిళా ముఖ్య మంత్రులు '' ఆద్యంతం చదివించింది. జిపియస్ స్వరం, పాత్రే ప్రాణం, సముద్రాలు ఈ దిన జలకన్య బాగున్నాయి. కార్టూన్ పంచ్, నవ్వుల్ పువ్వుల్ నవ్వుతెప్పించాయి. ప్రయాణ మార్గాల్లో ఉండే మలుపుల చిత్రాలు కళ్లను కట్టి పడేశాయి. మూఢ నమ్మకాలతో మన చుట్టుపక్కల ఏ చిన్న నీడని చూసినా దెయ్యాలంటూ భయపడిపోటుతుంటాం. అలాంటి భావనలకు సమాధానంగా నిలిచింది దెయ్యం కథ.
- కృష్ణ మోహన్, వైజాగ్
మరిపించాయి
రహదారుల్లోని మలుపుల సోయగాలు మరిపించాయి. నటనలో ప్రతిభావంతుల వ్వాలంటే ఇమేజ్ ఒకటే సరిపోదు. దాంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, పాత్రపై అవగాహనా కలిగుండాలి. ఈ లక్షణాల సమ్మేళనం రణదీప్ హూడా. అందుకే అతడికి పాత్రే ప్రాణమయ్యింది. చిన్నతనంలో స్కూల్లో అప్పుడప్పుడూ మనకి సహాయపడుతూ మనని జాగ్రత్తగా కాపాడుతుంటారు గార్డు. అలాంటి మంచి వ్యక్తిని కొన్నేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుని మరీ తనకి కొంత నిధిసమకూర్చడం హర్షణీయం. మూగ జీవాలను ఎంతో ప్రేమతో పెంచుకుంటారు కొందరు. అలాంటి జంతువులను పరిశోధనల్లో ఏవిధంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారో తెలిసి కన్నీటి పర్యంతమయ్యాం. మూవీల్లోకి ప్రయాణం, మన మహిళా ముఖ్య మంత్రులు, జిపిఎస్లో స్వరం, వింతలోకం, ప్రపంచం నర్తిస్తే ఆకట్టుకున్నాయి.
- ఆదర్శ, విజయవాడ