కాళ్లు సరిగా ముడవలేకపోవడం, నాలుగు అడుగులు నడుద్దామనే సరికి అమ్మో అనడం వంటివి అర్థరైటిస్(కీళ్లనొప్పులు) లక్షణాలు. ఈ వ్యాధికి టమాటాకు దగ్గర బంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఎరుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్న వారిలో అర్థ్ధరైటిస్ వ్యాధి కనిపిస్తోందని, అందులోనూ టమాటా అధికంగా తిన్న వారు దీని బారిన పడ్డారని నిర్ధారించారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రెండు వేల యాభై ఒక్క మందిపై పరిశోధకులు సర్వే చేశారు. వారిలో ఇరవై శాతం మందికి టమాటా తినడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని నిర్ధారించారు. కీళ్ల నొప్పులు లేని మరో పన్నెండు వేల ఏడొందల ఇరవై మందిని పరీక్షించి, టమాటా ఎక్కువగా తినడం వల్ల వారి రక్తం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తేల్చారు. కీళ్ల నొప్పుల వంటి వ్యాధులకు రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండడమే ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఏదోఒక కూరలో టమాటాను వేస్తున్నారు. టమాటాను అధికంగా తింటున్న వారు రక్తం పరీక్షలు చేయించుకుని యూరిక్ యాసిడ్ స్థాయిని తెలసుకోవాలని, ఒకవేళ అది ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడానికి మందులు వాడాలని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలతో కీళ్ల నొప్పులు, రక్త నాళాలు మూసుకుపోవడం వంటి వ్యాధులు వస్తాయని నిర్ధారించారు. సోయాబీన్ ఆయిల్లో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ప్యాక్డ్ఫుడ్ తయారీలో సోయాబీన్ ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు. అమెరికన్లు తీసుకుంటున్న ఆహారంలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాల కంటే ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు ఇరవై అయిదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనిపెట్టారు. కీళ్ల నొప్పులకు ఇదొక కారణమని చెబుతున్నారు. ఈ ఆమ్లాలు శరీరంలో ఎక్కువవ్వడంతో ఆస్తమా, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు రావడంతోపాటు లోపల మంటు పుడుతుందని తేల్చారు. వేపుళ్లు, వెన్న, కోడిగుడ్డు సొన, మాంసకృతుల్లో ఒమెగా 6 ఆమ్లాలు ఎక్కువగా ఉండడంతో వాటిని ఆహారంలో తగిన పరిమాణంలో తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ్య
టమాటాతో అర్థరైటిస్..!
