ఇంట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం సాధారణమైపోయింది. ముఖ్యంగా వంటింట్లో, వీటి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇళ్ళల్లో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ వస్తువులను ఎంత శుభ్రపరచినా కొంత వెగటు వాసనలు అలాగే ఉంటాయి. వాటిని తొలగించడం కొంచెం కష్టమేకానీ ఆసాధ్యం కాదు. ముందుగా శుభ్రపర చాల్సిన వస్తువులను చల్లని నీటితో కడగాలి. తర్వాత నీళ్లలో నానబెట్టి బయటకు తీసి, పొడి బట్టతో తుడిస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ వాసనను పోగొట్టేందుకు మరికొన్ని చిట్కాలు చూద్దాం. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి, పేస్టులా చేసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులకు ఆ మిశ్రమాన్ని అప్లై చేసి, కొన్ని గంటల తర్వాత మంచి నీటితో కడిగితే మొండి మరకలూ తొలగిపోతాయి. అలాగే నిమ్మతొక్కతో ప్లాస్టిక్ వస్తువులను రుద్ది, కడగడం వల్ల ప్లాస్టిక్ వాసనను దూరం చేయవచ్చు.
ప్లాస్టిక్ వాసన వస్తోందా?
