భారతదేశంలో కేన్సర్‌కు ట్రీట్మెంట్ తీసుకోవడం భారీ ఖర్చుతో కూడుకున్న విషయమేమీ కాదని, ఈ విషయంలో అవగాహన పెరగాలని బాలీవుడ్ నటి మనీషా కొయిరాల అన్నారు. కేన్సర్ తన జీవితంలోకి టీచర్లా వచ్చి, జీవితం విలువను తెలిపిందని పేర్కొందామె. మనీషా అండాశయ కేన్సర్‌తో పోరాడి గెలిచింది. ఆమె 'హీయిల్డ్ హౌ కేన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఆదివారం లిచరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న కొయిరాల మాట్లాడుతూ ' నేను నిర్లక్ష్యం చేయడం వల్ల నా ఆరోగ్యం నా నుంచి అనుమతి తీసుకుంది. అందుకే కేన్సర్ నాకు వచ్చింది. అయితే అది ఒక టీచర్లా వచ్చి పాఠం బోధించింది. జీవితం ఎంత విలువైందో ఇప్పుడు తెలిసింది. ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నా. ఎందుకంటే ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే ఏవిధంగానూ ఆనందంగా జీవించలేం. నేను రాసిన పుస్తకం కూడా నేను చనిపోవాలని అనుకోవడం లేదు అని రాశాను. కేన్సర్ వచ్చిందంటే ఆ వ్యక్తి చనిపోవాలనే ఆలోచన వచ్చేస్తుంది. ఈ వ్యాధి నాకొచ్చినప్పుడు షాక్ అయ్యాను. ఆ రోజు రాత్రి ఒంటరిగానే గడిపాను. ఖాట్మాండు నుంచి ముంబాయికి ట్రైన్లో కుటుంబంతో ప్రయాణించినా అనేక సార్లు అనేక విధాలుగా ఆలోచించాను. నాకు బాగా బాగోలేనప్పుడు పాజిటివ్ కథలు కోసం వెతికేదాన్ని. కేన్సర్‌ను జయించిన నటి లిసా రారు, క్రికెటర్ యువరాజ్ సింగ్ వంటి స్టోరీస్ తప్ప ఎక్కువగా అయితే సంపాదించలేకపోయాను. అందుకే కోలుకున్నాక నేను ఎదుర్కొన్న వాటిని తెలియజేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ పుస్తకం రాశా. నేను మళ్లీ బతికితే కేన్సర్ గురించి అందరిలోనూ అవగాహన పెంచాలని అనుకున్నా ' అని చెప్పింది.
కేన్సర్ నా జీవితాన్ని మార్చేసింది
