హైదరాబాద్: ప్రముఖ మలయాళీ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వెలిపడింతె పుస్తకం. ఈ చిత్రంలోని జిమ్మిక్కి కమ్మల్ అనే పాట ఇటీవలే విడుదలైంది. ఈ పాట ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మి కిమెల్కు చాలా నచ్చిందట.
పాటలోని చరణాలు తన పేరును తలపిస్తుండటంతో విన్నానని.. ఆ చరణాలు అర్థంకాకపోయినా చాలా నచ్చిందని జిమ్మి ట్వీట్ చేశారు. ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాటలో యువతీయువకులు కలిసి పాడుతూ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. దీనిని చూసిన నెటిజన్లు కూడా తమ స్టైల్లో ఈ పాటకు పేరడీగా డ్యాన్స్ చేసి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.జిమ్మి కిమెల్ నిర్వహించే టీవీ కార్యక్రమానికి ఇటీవల గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా హాజరైంది.
మోహన్‌లాల్ పాట అతనికీ నచ్చిందట
