కావల్సినవి :
పెరుగు : 1 కప్పు, అరటిపండు : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బాదం : 4,5 (పొడి చేసుకోవాలి), పిస్తాలు : 3,4 (పొడి చేసుకోవాలి), పంచదార : 3 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ : కొద్దిగా, ఐస్ క్యూబ్స్ : 3,4
తయారీ :
ముందుగా ఒక గిన్నెలో పెరుగు వేసి వడకట్టుకోవాలి. తర్వాత దానిని మిక్సీ జార్లో వేసి అరటి ముక్కలు, కొద్దిగా నీళ్ళు పోయాలి. అందులోని పంచదార కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకొన్న మిశ్రమంలో రెండు మూడు చుక్కలు రోజ్ వాటర్ వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు తీసుకొని అందులో ఐస్ ముక్కలు, లస్సీ, డ్రైఫ్రూట్స్ పొడి వేసి గార్నిష్ చేయాలి.
అంతే డ్రైఫ్రూట్ బనాన లస్సీ రెడీ.