కావాల్సినవి :
కోడిగుడ్లు : 6, మైదా : 2 కప్పులు, పంచదార : 3 కప్పులు, కోకో పౌడర్ : 50 గ్రా, పాలు : అరకప్పు, బటర్ : అరకప్పు, వెనీలా ఎసెన్స్ : 1టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ : 1టేబుల్ స్పూన్, నీళ్లు : అరకప్పు, ఈస్ట్ : అరకప్పు, ఉప్పు : చిటెకెడు.
తయారీ :
ముందుగా నెయ్యి , పంచదార బాగా కలిపేేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్లను పగలగొట్టి సొన వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మైదా, ఉప్పు , బేకింగ్ పౌడర్ , కోకో పౌడర్ కలిపి ఈ మిశ్రమాన్నంతా బాగా గిలకొట్టాలి. ఇప్పుడు పాలు , వెనీల ఎస్సెన్స్, నీళ్ళు పోసి మరోసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పానలో నెయ్యి రాసి, మైదాతో గ్రీస్ చేసి పైన తయారు చేసి పెట్టుకున్నకేక్ మిక్స్ అందులో వేసి ఒవెన్‌లో బేక్ చేసుకోవాలి. అంతే మనకి నచ్చిన విధంగా చాక్లెట్ సిరప్‌తో లేదా ఐసింగ్ షుగర్‌తో గార్నిష్ చేయాలి అంతే చాక్లెట్ కేక్ రెడీ.
చాక్లెట్ కేక్
