పలకపై అక్షరాలు దిద్దడమే కాదు; చదరంగం బోర్డుపై పావులు కదపడం అంటే ఆ చిన్నారికి చాలా ఇష్టం. చిన్న వయసులోనే చెస్ ఆడటం మొదలుపెట్టిన ఆ చిన్నారికి నాన్నే తొలి గురువు. ఆలా పలు టోర్నమెంట్లు, ఎస్జిఎఫ్ సెలక్షన్లకు అడుగుపెట్టిన ఆ అమ్మాయి ఆ తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌ల్లో పతకాలు గెలుచుకుంది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లోని ఆసియా స్థాయి యూనివర్శిటీ చెస్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆమె మరెవరో కాదు నల్గొండ జిల్లాకు చెందిన క్రీడాకారిణి దివ్య. అమె పరిచయం మీ కోసం.
- దివ్య నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన అమ్మాయి.
- మాశెట్టి శ్రీనివాస్, గీత అమ్మానాన్నలు.
- చిన్నతనం నుంచి చదరంగం అంటే చాలా ఇష్టం.
- చదరంగం ఆటలో తన ఇష్ట్టాన్ని గమనించిన తండ్రి ఆమెను మరింతగా ప్రోత్సహించారు.
- నాన్న నుంచే చదరంగంలో తొలి పాఠాలు నేర్చుకుంది.
- ఆ తర్వాత కోచ్‌లు పార్ధసారథి, సైదులుల వద్ద చెస్‌లో మెలకువలు నేర్చుకుంది దివ్య.
- విశ్వనాథ్ ఆనంద్ తన రోల్ మోడల్.
- 2008లో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో జరిగిన ఆల్ జూనియర్స్ చాంపియన్షిప్పోటీల్లో పాల్గొని, టాప్‌టెన్ స్థానంలో నిలిచింది. అదే సంవత్సరం చెన్నైలోని నిర్వహించిన జాతీయస్థాయి క్రీడల్లో రాష్ట్రం తరపున పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.
- 2009లో జార్ఖండ్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా చెస్ జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పోటీలకు ప్రాతినిధ్యం వహించింది.
- 2010లో హైద్రాబాద్‌లో ఆల్ ఇండియా ఫెడరేషన్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని 2వ స్థానంలో నిలిచింది.
- 2010లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జిఎఫ్) పోటీల్లో పాల్గొని పతకాన్ని సొంతంచేసుకుంది.
- 2011లో గోవాలో జరిగిన 41వ జాతీయ స్థాయి జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌కు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించింది.
- ఇలా రాష్ట్రస్థాయి పోటీలతోపాటు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
- 2018లో ఫిలిప్పీన్స్‌లో జరగనున్న ఆసియాస్థాయి యూనివర్శిటీ చెస్ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.
- చదరంగం క్రీడాకారిణిగా కొనసాగుతూనే లా విద్యను అభ్యసిస్తోంది.
- కృషి, పట్టుదలతో పాటు ప్రణాళిక ఉంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవచ్చంటారు దివ్య.
చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్‌లా దేశానికి పేరుతేవడమే తన ముందున్న లక్ష్యం. ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఉంటే మరింతమంది అమ్మాయిలు ఈ క్రీడలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందనేది తన అభిప్రాయం.
- పరిమళ
‘దివ్య’మైన ప్రతిభ
