ఐదుగురు అక్కాచెల్లెళ్ళు బాస్కెట్‌బాల్ క్రీడలో సత్తాచాటుతున్నారని మీకు తెలుసా..! సింగ్ సిస్టర్స్‌గా పేరొందిన ఈ అక్కాచెల్లెళ్ళకు రోల్‌మోడల్ ఆ కుటుంబంలోని పెద్దమ్మాయి ఆకాంక్ష సింగ్. అంతర్జాతీయ క్రీడాకారిణిగానే కాక కోచ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. బాస్కెట్‌బాల్ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణుల్లో అత్యంత ప్రతిభావంతురాలిగా పేరుతెచ్చుకున్న ఆకాంక్ష సింగ్ పరిచయం మీకోసం...
- ఆకాంక్ష సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 1989 మే 7న జన్మించింది.
- మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్ళున్న ఆ కుటుంబంలో మొదటి అమ్మాయి ఆకాంక్ష.
- తండ్రి గౌరీ శంకర్ సింగ్ బ్యాంక్ ఉద్యోగి. తల్లి ఊర్మిళా సింగ్ గృహిణి.
- ప్రియాంక సింగ్, దివ్య సింగ్, ప్రశాంతి సింగ్, ప్రతిమ సింగ్ చెల్లెళ్ళు. ప్రియాంక సింగ్ ఎన్ఐఎస్ బాస్కెట్ బాల్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ డెలావర్ బాస్కెబాల్టీమ్తో పనిచేస్తుంటే..ప్రతిమ జాతీయస్థాయి జూనియర్ మహిళా బాస్కెట్ బాల్ జట్టుకు కెప్టెన్. ప్రశాంతి మహిళల జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
- ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది ఆకాంక్ష.
- క్రికెట్ స్టార్ ఇషాంత్ శర్మ తన దగ్గర బంధువు.
- సింగ్ సిస్టర్స్ ఐదుగురూ క్రీడల్లో కంటే సివిల్ సర్వీసెస్‌లో రాణించాలనేది తండ్రి ఆకాంక్ష. అయితే వారికి ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడలో రాణించడానికి వారికి ప్రేణరణనిచ్చింది మాత్రం తల్లి ఊర్మిళే.
- ఓసారి గోరక్‌పూర్‌లో జరిగిన అండర్-17 బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొన్న వారణాసికి చెందిన టీమ్‌లో ఒక అమ్మాయి ఆనారోగ్యంతో ఆడలేకపోవడంతో జట్టులో మరో ప్లేయర్ కోసం ఆకాంక్షను తీసుకున్నారు. అలా తొలిసారిగా జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ క్రీడలోకి ప్రవేశించిన ఆకాంక్ష ఆ తర్వాత వెనుదిరగలేదు.
- 2004లో చైనాలో జరిగిన 17వ ఎఫ్ఐబిఎ (ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫర్ జూనియర్ ఉమెన్) మహిళల జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న తను తక్కువ సమయంలోనే జూనియర్స్ విభాగంలో జాతీయస్థాయి క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంది.
- అలా 2004 నుంచి 2010 వరకు తను జాతీయ, అంతర్జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది.
- 2005లో ఢిల్లీలోని సెయింట్ పీటర్స్ కాలేజ్ ఇన్విటేషనల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొని బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకుంది. అదే సంవత్సరం చైనాలో జరిగిన 21వ ఎఫ్బిఎ ఆసియా బాస్కెట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్న తను ఇక ఆటలో వెనుతిరిగి చూడలేదు.
- 2006లోనూ సెయింట్ పీటర్స్ కాలేజ్ ఇన్విటేషనల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సీనియర్స్ విభాగంలో బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకుంది.
- 2007లో కొరియాలో జరిగిన 23వ ఎఫ్బిఎ ఆసియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ సీనియర్స్ విభాగంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది.
- 2008లో మన నెల్లూరులో జరిగిన మొట్టమొదటి ఆలిండియా మస్తాన్ బాస్కెట్ బాల్ ప్రొఫెషనల్ లీగ్‌లో పాల్గొని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా కితాబును అందుకుంది.
- 2010లో ముంబరులో జరిగిన ఎమ్బిపియల్ లీగ్ మ్యాచ్‌లో బెస్ట్‌ప్లేయర్ అవార్డుతోపాటు అదే సంవత్సరం ముంబరులో జరిగిన ఆలిండియన్ మస్తాన్ బాస్కెట్ బాల్ ప్రొఫెషనల్ లీగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభావంతురాలిగా అవార్డును దక్కించుకుంది. అదే సంవత్సరం చైనాలో జరిగిన ఆసియా గేమ్స్ సీనియర్స్ విభాగంలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. 2008- 2010వరకు వివిధ దేశాల్లో నిర్వహించిన ఆసియా గేమ్స్‌తో పాటు ఎఫ్బిఎ చాంపియన్‌షిప్ పోటీలకు మహిళల బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. .
- 2010లో వారణాసికి చెందిన అండర్-17 బాలుర బాస్కెట్ బాల్ జట్టుకు కోచ్‌గా పనిచేసింది.
- బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎ-గ్రేడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన నలుగురు క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు.
- బాస్కెట్‌బాల్ క్రీడలో ఎక్కవ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణిగా కూడా తనకు గుర్తింపు ఉంది.
- 2017లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ బుల్చంద్ని వివాహం చేసుకుంది.
- ఆకాంక్ష స్ఫూర్తిగా ప్రస్తుతం తన చెల్లెళ్ళు బాస్కెట్ బాల్ క్రీడలో దూసుకెళుతున్నారు.
- శర్వాణి