ప్రజాశక్తి-బిసి.రోడ్డు
గాజువాక అసెంబ్లీ వైసిపి అభ్యర్థిగా పోటీచేసిన తిప్పల నాగిరెడ్డి విజయం కోసం పార్టీ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ ఇరోతి గణేష్ ఆధ్వర్యాన 50వ వార్డు రాజీవ్‌మార్గ్‌లోని సత్తెమ్మతల్లి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు జరిపారు. 108 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం నాగిరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, 23న వచ్చే ఎన్నికల ఫలితాల్లో తన విజయం ఖాయమన్నారు. తన విజయం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. నవరత్నాలను అమలు చేయడంతో పాటు పేదల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేదలు సొంతిల్లు లేక అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీఇచ్చారు. ఇరోతి గణేష్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గాజువాక వైపు రాష్ట్రమంతా దృష్టి సారించిందని, నాగిరెడ్డి విజయం సాధించి చరిత్ర సృష్టించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ 50వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీను, మార్టుపూడి పరదేశి, మద్ది శంకరరెడ్డి, మద్దాల అప్పారావు, ఓలేటి నూకరాజు, దొడ్డి రమణ, పితాని అన్నవరం, లోకనాథం, మంగునాయుడు, పిట్టా ప్రకాశ్‌రెడ్డి, జుత్తుల లక్ష్మి, వాసు, గూన శ్రీనివాసరావు, ఎన్నేటి కనకారావు, మంత్రి మంజుల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగిరెడ్డి విజయానికి పూజలు
