ప్రజాశక్తి-పద్మనాభం
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరి వ్యక్తులకు సిఎం సహాయ నిధినుంచి రూ.1.16 లక్షల చెక్కులను బుధవారం అందజేశారు. జెడ్పిటిసి కె.దామోదరరావు, టిడిపి మండల అధ్యక్షులు కె.నగేష్‌కుమార్ పాల్గొని బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. పద్మనాశభం ఎంపిడిఒ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయరామపురం గ్రామానికి చెందిన అంకమ్మ పిడుగుపాటుకు గురైన తలకు దెబ్బ తగలడంతో విజయనగరం తిరుమల ఆసుపత్రిలో చికిత్స పొందింది. దీనికి ఆసుపత్రి వర్గాలు రూ.72 వేలు బిల్లు వేశారు. అలాగే కొత్తకొవ్వాడ గ్రామానికి పొన్నకాయల శ్యామ్‌కుమార్ అనారోగ్యం కారణంగా మూడు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు ఈయనకు రూ. 1.30 లక్షల బిల్లు వేశారు. వీరు ఇరువురు సిఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకోవడంతో వారికి ఈ నిధిని మంజూరు చేశారు. శ్యామ్‌కుమార్‌కు, రూ.68వేలు, అంకమ్మకు రూ. 48వేలు మంజూరయ్యాయి. వాటిని బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.
సిఎం సహాయనిధి అందజేత
