సోషల్ మీడియాలో పుట్టే ఏ పుకారైనా ఏకకాలంలో కొన్ని వేల మందికి చేరుతుంది. అలా గొలుసు కట్టు వదంతుల ప్రభావంతో ఇటీవల దాడులు జరగడం చూస్తున్నాం. పైగా గ్రామాల్లో ఉన్న నిరక్ష్యరాస్యులపై వీటి ప్రభావం తీవ్రంగా వుంటోంది. ఈ ఘటనల్లో బాధితులుగా మిగులుతూ, చేయని తప్పులకు మూకుమ్మడి దాడులకు గురౌతున్న అమాయకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు అదేపనిగా 'నమ్మకాల' పేర అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, సమాజాన్ని నిత్యం ఏదో ఒక అవాస్తవ అంశంతో గందరగోళ పరచడం వీరికి నిత్యకృత్య మైంది. ప్రజలు ఎప్పుడూ అభద్రతలోనే కొట్టుమిట్టాడేలా తీవ్రంగా ప్రయత్నిస్తూ వికృతానందం పొందుతున్నారు. విజ్ఞాన పరులంతా ఇలాంటి చర్యలని ఖండించాలి. నిరంతరం అధ్యయనం చేసి, వాస్తవాలను ఎప్పటికప్పుడు విశ్లేషించాలి.
- రవి కుమార్ సంగనమోని
ఇమెయిల్ ద్వారా.