మందుల చీటీలలో దాదాపు 90 శాతం మంది వైద్యులు నిబంధనలు పాటించకుండా గొలుసు కట్టు రాతలు రాస్తున్నారు. మందుల షాపుల వాళ్లకు అవి అర్థం కాక ఒకటికి బదులు మరొకటి ఇచ్చేస్తున్నారు. దీంతో రోగానికి సరిపడ మందు వాడక పోవడం వల్ల రోగుల ప్రాణాల పైకి వస్తోంది. మందుల చీటీలో విడి విడి అక్షరాలతో, మందుల జనరిక్ పేరు రాయాలని మెడికల్ కౌన్సిల్ చెప్పింది. అది పాటించకపోగా, మందుల కంపెనీల పేరు రాస్తున్నారు. పైగా రోగి అనారోగ్యాన్ని గోప్యతగా ఉంచలేకపోతున్నారు. ఒకేసారి చాలా మంది రోగులకు సమయాన్ని కేటాయించటం, ఇరుకైన వైద్యాలయాలే దీనికి కారణం. ఇకనైనా నియమ నిబంధనలతో కూడిన మెరుగైన వైద్య సదుపాయాలు ప్రజలకు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- శేష సాయి కుమార్, తిరుపతి.
మందుల చీటీల రాతలు మారాలి
